సునీల్‌కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలి
విజయనగరం టౌన్: దళిత అధికారులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరిత చర్యలు చేపట్టడం దారుణమని, కూటమి ప్రభుత్వం పలువురు దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులివ్వకుండా ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తోందని, డీజీ ర్యాంకులో ఉన్న పీవీ.సునీల్ కుమార్‌పై ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపు చేపట్టడం విచారకరమని అంబేడ్కర్ ఇండియా మిషన్ ప్రతినిధులు బొంగ భానుమూర్తి, రేగాన శ్రీనివాసరావు, కె.భీమారావు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక బాలాజీ కూడలి వద్దనున్న అంబేడ్కర్ భవన్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 జూన్ 12 తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి నేటివరకూ సుమారు తొమ్మిదినెలల కాలంలో రాష్ట్రంలో ఉన్న దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేస్తూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెడుతూ, నారా లోకేష్ తీసుకువచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అములుచేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగాన్ని మోడీ అమలుచేస్తే, రాష్ట్రంలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేస్తూ తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో సోము మురళీమోహన్, పి.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ ఇండియా మిషన్, దళిత సంఘాల నాయకులు
Comments
Please login to add a commentAdd a comment