క్రీడల్లో మిమ్స్ వైద్య విద్యార్థుల ప్రతిభ
నెల్లిమర్ల: ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన క్రీడాపోటీల్లో నెల్లిమర్లలోని మిమ్స్ హోవియో కళాశాల వైద్య విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ మేరకు సోమవారం మిమ్స్ పీఈటీ కె.వెంకటరావు మాట్లాడుతూ ప్రతిపాడు హెల్త్ యూనివర్సిటీ ఏఎస్‌ఆర్ హోమియో వైద్య కళాశాలలో మూడు రోజులుగా జరుగుతున్న అంతర్ కళాశాల క్రీడా పోటీల్లో మిమ్స్ హోమియో వైద్య విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఓవరాల్ చాంపియన్ సాధించారని తెలిపారు. అలాగే పోటీల్లో పురుషులు, మహిళా జట్లు విజేతలుగా నిలిచాయని చెప్పారు. పురుషుల జట్టు క్రికెట్, టేబుల్‌టెన్నిస్, డిస్కస్‌త్రో, షాట్‌పుట్‌లో బంగారు పతకాలు సాధించగా, మహిళా క్రీడాకారులు వాలీబాల్, త్రోబాల్, బ్యాడ్మింటన్, పరుగుపందెంలో బంగారు పతకాలు సాధించారని వివరించారు. ఈ సందర్భంగా మిమ్స్ చైర్మన్,మేనేజింగ్ ట్రస్టీ అల్లూరి సత్యనారాయణరాజు, మేనేజింగ్‌ట్రస్టీ డాక్టర్ ప్రవీణ్ వర్మ, డీన్ డాక్టర్ లక్ష్మీకుమార్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రఘురాం, అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ వేణుగోపాలరావు, సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, హోమియోపతి వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, ఏఓ పి.గణేష్ పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment