పార్వతీపురం టౌన్: ప్రస్తుత వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారుల ను ఆదేశించారు. జూన్ మాసాంతం వరకు నిరంత రం తాగునీరు సరఫరా చేసేలా ముందస్తు ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. సమస్యతలెత్తితే సంబంధిత ఎంపీడీఓ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. నీటి ఎద్దడి ఉన్నచోట బోర్లు వేసేందుకు, పాడైనవి బాగుచేసేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులు/ఐటీడీఎ/ జెడ్పీ నిధులు వినియోగించుకోవాలని సూచించా రు. ఎక్కడైనా తాగునీటి సమస్యలు తలెత్తితే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. పీఎం సూర్యఘర్ యూనిట్లను అధిక మంది వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీఎం జన్‌మన్, పీఎంఏవై 2.0 కింద నిర్మితమవుతున్న గృహాలపై ఐటీడీఎ పీఓలు ప్రత్యే క శ్రద్ధ కనబరచాలన్నారు. జిల్లాలో 94 సెల్ టవర్ల ఏర్పాటుకు బీఎస్‌ఎన్‌ఎల్, జియో, ఎయిర్టెల్ నెట్ వర్క్స్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని, టవర్లులేని ప్రాంతాలను గుర్తించి గురువారం నాటికి నివేదికలు అందజేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓలు అశుతోష్ శ్రీవాస్తవ, సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, హౌసింగ్, డ్వా మా, డీఆర్డీఏ, ఐసీడీఎస్ పీడీలు ధర్మచంద్రారెడ్డి, కె. రామచంద్రరావు, వై.సత్యంనాయుడు, టి.కనకదు ర్గ, సీపీఓ పి.వీర్రాజు, డీపీఓ టి.కొండలరావు, జిల్లా ఆరోగ్య శాఖాధికారి ఎస్.భాస్కరరావు, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ ఎస్.మన్మథరావు, జిల్లా మత్స్య శాఖాధికారి వి.తిరుపతయ్య, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకరరావు, జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎస్.కష్ణ, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ కె.చలపతిరావు, డీఎస్డీఓ కె.సాయికష్ణచైతన్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment