కూటమి ప్రభుత్వానికిచెంపపెట్టు
–8లో
మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025
అందుబాటులో హాల్ టికెట్లు
పార్వతీపురంటౌన్: పదో తరగతి విద్యార్థులకు హాల్‌టికెట్లు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతినాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, మీడియం, విద్యార్థి ఫొటో, సంతకం, సబ్జెక్టు వివరాలు నిశితంగా పరిశీలించి తప్పులు గమనిస్తే వెంటనే గౌరవ సంచాలకులు, ప్రభుత్వ పరీక్షల విభాగాన్ని సంప్రదించాలన్నారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌లను వాట్సాప్ ద్వారా పోందే వెసులబాటు ఉందన్నారు.
లింగ నిర్ధారణ చేసేవారిపై కఠిన చర్యలు
విజయనగరం ఫోర్‌్ట: లింగ నిర్ధారణ చేసేవారితో పాటు, సంబంధిత అంశంపై వాణిజ్య ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగ్‌లు పెట్టేవారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి హెచ్చరించారు. జిల్లా వైద్యశాఖ పరిధిలో నమోదైన ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. సీసీపీఎన్‌డీటీ యాక్టును అతిక్రమిస్తే మూడు నుంచి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకు జరిమానా తప్పదన్నారు.
సీనియార్టీ జాబితాపై
అభ్యంతరాల స్వీకరణ
● ఈ నెల 10వ తేదీలోపు గడువు
● డీఈఓ యు.మాణిక్యంనాయుడు
విజయనగరం అర్బన్: పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ కింద పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయ/ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని డీఈఓ యు.మాణిక్యంనాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) రూపొందించిన ఈ జాబితాపై ఎలాంటి అభ్యంతరాలున్నా ఈ నెల 10వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. అభ్యంతరం చేసే ఉపాధ్యాయుని పూర్తి పేరు, పనిచేస్తున్న కేడర్, అభ్యంతరం చెబుతున్న వివరాలు వివరించాలి. సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలి. ఆధారాలు లేదా సంబంధిత సాక్ష్యాలు విధిగా జతచేయాలి. పూర్తి వివరాల కోసం జిల్లా విద్యాశాఖ కార్యాయంలో సంప్రదించవచ్చని తెలియజేశారు.
రోడ్డు పనులకు సహకరించండి
● అటవీశాఖ అధికారులకు ఎస్టీ కమిషన్ చైర్మన్ సూచన
విజయనగరం అర్బన్: అల్లూరి జిల్లా అనంతగిరి మండలం చిన్నకోనల గిరిశిఖర గ్రామ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అధికారులు సహకరించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు కోరారు. రోడ్డు పనులను అటవీశాఖాధికారులు అడ్డుకుంటున్నారంటూ గిరిజనుల నిరసన తెలపడంపై ఆయన సోమవారం స్పందించారు. నాన్ షెడ్యూల్ ఏరియాలోని రొంపల్లి పంచాయతీ పరిధి కొండశిఖర గ్రామాలైన చిన్నకోనల, భూరిగా, వనిజతో పాటు ఎన్.ఆర్.పురం పంచాయతీ పరిధిలోని మరో ఐదు గ్రామాలను కలుపుతూ వేసే రోడ్డు నిర్మాణంపై అటవీశాఖ అభ్యంతరాలను నివేదిక రూపంలో అందజేయాలని సంబంధిత అధికారులను కోరారు. గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనపై అలసత్వం వహించరాదన్నారు.
బొబ్బిలిలో నిలిచిన
గూడ్స్‌రైలు
బొబ్బిలి: సాంకేతిక సమస్య కారణంగా బొబ్బిలి–డొంకినవలస రైల్వేస్టేషన్‌ల మధ్య ఓ గూడ్స్‌రైలు సోమవారం సాయంత్రం నిలిచిపోయింది. దీంతో బొబ్బిలి రైల్వేస్టేషన్ మీదుగా ప్రయాణించాల్సిన విశాఖ–కొరాపుట్ రైలుతో పాటు పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గంట కాలం పాటు రైలు అలాగే ఉండిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. స్పందించిన రైల్వే అధికారులు.. కొరాపుట్ రైలుకు వేరే ఇంజిన్ తెప్పించి, రైలును కదిలించే ప్రయత్నం చేశారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవి వ్యూహాలు... మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి ముక్తాయింపులు... టీడీపీ ఎమ్మెల్యేలు కళావెంకటరావు, బేబీనాయన, అదితి గజపతిరాజు ఒడ్డిన సర్వశక్తులు, కోళ్ల లలితకుమారి, విజయచంద్ర తదితర కూటమి ఎమ్మెల్యేల సముదాయింపులు, బెదిరింపులు, లాలింపులు, తాయిలాలు, తాలింపులు... ఇవేవీ ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను గెలిపించలేకపోయాయి. సార్వత్రిక ఎన్నికలను తలపించేలా ప్రతి ఎమ్మెల్యే, మండల స్థాయి నాయకులు ఎంత ప్రచారం చేసినా, చివరకు పోలింగ్ రోజున కేంద్రాల ముందు శిబిరాలు తెరిచి కూర్చున్నా వారి ప్రయత్నాలన్నీ మేధావుల నిర్ణయం ముందు తేలిపోయాయి. అధికారం అప్పగించి తొమ్మిది నెలల్లోనే అరాచకాలతో, అప్రజా స్వామిక పాలన సాగిస్తున్న టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వానికి తమ ఓటుతో బుద్ధి చెప్పా రు. ఒకవైపు పలు ఉపాధ్యాయ సంఘాల ప్రత్యక్ష మద్దతు, వైఎస్సార్‌సీపీ పరోక్ష మద్దతుతో పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడు ఘన విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి కూడా గట్టి పోటీ చేశారు. వీరిద్దరికీ కలిపి ప్రథమ ప్రాధాన్య ఓట్లలో సుమారు 70 శాతం వరకూ రాగా, కూటమి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డినా ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు రమారమి 30 శాతం ఓట్లే దక్కాయి. అధికార దర్పంతో విర్రవీగుతున్న ‘రెడ్‌బుక్’ ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చిన తీర్పు ఒక చెంపపెట్టు వంటిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
● మూడోసారి గాదెకు అవకాశం...
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి సభ్యునిగా డాక్టర్ గాదె శ్రీనివాసులనాయుడు ఎన్నిక సోమ వారం రాత్రి 10 గంటలకు ఖరారైంది. గతంలో రెండు సార్లు ఉపాధ్యాయ శాసనమండలికి ప్రాతిని ధ్యం వహించిన ఆయనకు ఆరేళ్ల విరామం తర్వాత మరోసారి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు అవకాశం ఇచ్చారు. విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ ఉపాధ్యాయ, విద్యారంగంలోని సమస్యలపై పోరాడుతూ వచ్చిన గాదె ఉత్తరాంధ్ర సుపరిచితులు. పీఆర్‌టీయూ సంఘానికి జిల్లా, రాష్ట్రస్థాయి నాయకత్వం వహించారు. వాస్తవానికి గాదె పూర్వీకులది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలోని జోగింపేట గ్రామం. ఉద్యోగరీత్యా ఆయన తండ్రి వెంకునాయుడు విజయనగరం జిల్లాకు నివాసం వచ్చేశారు. జిల్లా పరిషత్ సీఈవోగా ఉమ్మడి (శ్రీకాకుళం, విజయనగరం) జిల్లాలో పనిచేశారు. అలా జిల్లాతో అనుబంధం ఏర్పడిన శ్రీనివాసులనాయుడు తన పాఠశాల విద్యను విజయనగరం, గజపతినగరం ప్రాంతాల్లోనే సాగించారు. ఉన్నత విద్య విషయానికొస్తే ఆయన ఎమ్మెస్సీ, ఎంటెక్, బీఈడీ, ఎంఏ (ఎడ్యుకేషన్) పూర్తి చేశారు. విద్యారంగంపై పరిశోధన చేశారు. పీహెచ్‌డీ పట్టాతో డాక్టర్ శ్రీనివాసులనాయుడు అయ్యారు. 2007, 2013 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుసగా రెండు దఫాలు ఉత్తరాంధ్ర ఉపాధ్యా య ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ హక్కుల సాధనలో ఆయన కృషిని ఉపాధ్యాయులు గుర్తించారు.
● ఉపాధ్యాయ సంఘాల మద్దతు...
రఘువర్మ పదవీకాలం పూర్తికావడంతో జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి శ్రీనివాసులనాయు డు బరిలో నిలిచారు. ఆయనకు ఏపీటీఎఫ్ (1938) , ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్), రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ), ఆర్‌యూపీపీ, బీటీఏ, ఏపీటీయూ (ఎయిడెడ్), ఏపీటీ జీ (ఎయిడెడ్), టీఆర్‌ఈఐఎల్‌ఏ, టీఆర్‌ఈఐటీఏ, జీజీటీఏ, ఏపీజీటీడబ్ల్యూఆర్‌ఎస్, ఏటీఏ, ఎస్‌డ బ్ల్యూఈఎఫ్–ఏపీ, ఏపీటీడబ్ల్యూఏహెచ్‌ఎస్, ఏపీటీ డబ్ల్యూఆర్‌ఎస్ జూనియర్ కళాశాలలు, ఏపీపీటీ, పీఈటీ, పీడీ, పీటీఎల్‌ఎఫ్, ఏపీఎంపీఎస్‌టీయూ తదితర సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆయన ముచ్చటగా మూడోసారి శాసనమండలిలో అడుగుపెట్టడానికి సహకరించాయి.
విలేకరుల సమామేశంలో మాట్లాడుతున్న మాజీ డిప్యూటీ సీఎం పీడీక రాజన్నదొర,
పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి
సాలూరు రూరల్: సంక్షేమ పథకాలు, జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఏకై క హీరో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి అని, ఆయన పాలన సంక్షేమానికి చిరునామాగా పేరొందిందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. సాలూరులోని రాజన్నదొర ఇంటి వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అబద్ధాలు చెప్పడంలో కూటమి నేతలు ఆరితేరిపోయారన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేశ్ జాబ్, సంక్షేమ క్యాలండర్ విడు దల చేస్తామని చెప్పిన విషయం నిరుద్యోగులు, ప్రజలకు గుర్తుందన్నారు. సంక్షేమ పథకాలు అందిస్తారని ప్రజలు ఇప్పటికీ ఆశగా ఎదురు చూస్తున్నారని, తక్షణమే పథకాలు అందజేయాలన్నారు. ప్రస్తుతం పేదలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. 2014లో రైతు రుణమాఫీ కింద రూ. 87వేల కోట్లు బ్యాంకులకు కట్టాల్సి ఉండగా కేవల రూ.20వేల కోట్లు కట్టిన చంద్రబాబునాయుడు.. మరోసారి రైతులకు రూ.20వేలు పెట్టుబడి సా యం అందజేస్తామని మోసం చేశారన్నారు. మహిళలకు రూ.12వేల కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేయడంతో వడ్డీతో కలిపి రూ.25వేల కోట్లను నాలుగు దఫాలుగా గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చెల్లించిన విషయం అందరి కీ గుర్తుందన్నారు. 41లక్షల మంది తల్లులకు అమ్మవడి అందించిన ఘనత జగన్ మోహనరెడ్డికే దక్కుతుందన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఎం.తులసిరెడ్డి వంటి మేధావులు కూటమి ప్రభుత్వం కంటే గత జగన్ ప్రభుత్వం మేలు చేసిందని చెబుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం గట్టిగా తిప్పికొట్టిందన్నారు. ఇప్పటికై నా టీడీపీ నాయకులు అబద్ధాలు చెప్పడం మాని వాస్తవాలకు దగ్గరగా పాలన అందించాలని హితవు పలికారు.
విజయనగరం ఫోర్ట్: కూటమి ప్రభుత్వ పాలనలో రేషన్ లబ్ధిదారుల ‘పప్పు’లుడకవిక. పేదలకు సరఫరా చేసే కందిపప్పు సరఫరాకు ఎసరు పెట్టింది. కేవలం బియ్యం, పంచదార సరఫరాకే ప్రజాపంపిణీ వ్యవస్థను పరిమితం చేసింది. ఎన్నికలవేళ అలవికాని హామీలిచ్చిన కూటమి నేతలు గద్దె నెక్కాక ఒక్కొక్కదానిని తుంగలో తొక్కడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం పేరిట రూ.15 వేలు చొప్పున అందిస్తామని చెప్పారు. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా ఆర్థిక సాయం సున్నాగానే మిగిలింది. రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ పథకంగా పేరుమార్చి రైతులకు ఏమార్చారు. పైసా సాయం అందజేయకుండా కష్టాల్లోకి నెట్టారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఉత్తుత్తిదే అని తేల్చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పారు. ఒక్కరికీ ఇచ్చిన దాఖాలా లేవు. నిరుద్యోగ భృతి ఎండమావిగానే మారింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అన్ని సరుకులు ప్రజలకు అందిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందించే సరుకుల్లోనూ కోత విధిస్తూవస్తున్నారు. గత కొద్ది నెలలుగా కందిపప్పులో కోత విధిస్తున్న కూటమి సర్కారు మార్చి నెలకు ఏకంగా మంగళం పాడేయడంపై మండిపడుతున్నారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని పాలన ఎందుకంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అమరావతిని కట్టేస్తే పేదల కడుపునిండుతుందా అని ప్రశ్నిస్తున్నారు. పెద్దల లబ్ధికోసం పేదలకు కేటాయించాల్సిన డబ్బులన్నీ రాజధాని నిర్మాణం పేరుతో జేబుల్లోవేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో తెలుపు రేషన్‌కార్డు దారులు 5,71,354 మంది ఉన్నారు. వీరికి నెలకు 571.354 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రజలు జీవనానికి ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.180 పలుకుతున్న కందిపప్పును కొనుగోలు చేయడం తలకుమించిన భారంగా మారింది. ప్రభుత్వం స్పందించి గతంలో వలే కిలో రూ.67 చొప్పున రాయితీపై అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం టౌన్: జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అసక్తికలిగిన పెట్టుబడిదారులను స్వాగతిస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా పర్యా టక అభివద్ధి మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రీసార్ట్స్, బోటింగ్, వాటర్ స్పోర్ట్స్, లోటస్ గార్డెన్ ఏర్పాటుకు ముందుకు వచ్చే పెట్టుబడిదారులను స్వాగతిస్తామని, వారికి కావల సిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామన్నారు. తోటపల్లి, వెంగళరాయసాగరం, పెద్దగెడ్డ వంటి రిజర్వాయర్ల లో బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటివి ఏర్పాటు చేయవచ్చన్నారు. తోటపల్లి వద్ద ఉన్న ఐటీడీఏ పార్కును అభివృద్ధి చేయాలని సూచించారు. ఆడలి వ్యూపాయింట్ వద్ద రక్షణ గోడలు, రహదారి పను లు, రెండు గదుల నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తి కావాలని, నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ స్పష్టంచేశారు. పార్వతీపురంలో బడ్జెట్ హోటల్ నిర్మాణానికి ముందుకు వచ్చిన పెట్టుబడిదారులకు స్థలాన్ని అప్పగిస్తామని, ప్రభు త్వం రాయితీలను ప్రకటించిందని కలెక్టర్ గుర్తుచేశారు. అరుకు–సాలూరు–పార్వతీపురం మీదుగా మందస వరకు గల సర్క్యూట్ టూరిజంను వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపి ప్రారంభించాలని సూచించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓలతోపా టు డీపీఓ టి.కొండలరావు, అడ్వంచర్ అండ్ వాట ర్ స్పోర్ట్స్ డైరెక్టర్ బి.బలరాంనాయుడు, నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీరు ఆర్.అప్పలనాయుడు, తోటపల్లి రిజర్వాయర్ ఉపకార్యనిర్వాహక ఇంజినీరు టి.రఘునాథనాయుడు, దేవదాయ శాఖాధికారి యస్.రాజారావు తదితరులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
ఉత్తరాంధ్ర వేదికగా తిరుగుబాటు...
కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు ఉత్తరాంధ్ర వేదికగా తిరుగుబాటు మొదలైంది. తొలుత ఆ బాధ్యతను మేధావివర్గం భుజానకెత్తుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నడూ కనిపించిన రాజకీయ జోక్యాన్ని కలిసికట్టుగా తిప్పికొట్టారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తే ఓటుతో బుద్ధిచెబుతారని తెలియజెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ప్రజా, ఉద్యోగ వ్యతిరేక పాలన సాగిస్తూ, కక్షపూరిత రాజకీయాలకు తెరతీసిన కూటమి ప్రభుత్వం ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనన్న సంకేతాన్ని మేధావివర్గం ఇచ్చిందన్న చర్చ పల్లెలు, పట్టణాల్లో జోరందుకుంది.
రోడ్లు వేసినది ఎవరో ఏజెన్సీ ప్రాంత గిరిజనులను అడితే చెబుతారు అబద్ధాలు చెప్పినంత సులభం కాదు పనులు చేయడం ప్రజల్లోకి వెళ్తే కూటమి పాలన ఎలా ఉందో తెలుస్తుంది.. కూటమి ప్రజావ్యతిరేక పాలనను తిప్పికొట్టిన మేధావి వర్గం మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి
వ్యవసాయ పద్ధతులపై అవగాహన అవసరం
ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎంవీవీ శ్రీనివాస్
విజయనగరం ఫోర్ట్: వ్యవసాయ పద్ధతులను విద్యార్థులు తెలుసుకోవాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎంవీవీ శ్రీనివాస్ తెలిపారు. ఏరువాక కేంద్రంలో సోమవారం గ్రామీణ వ్యవసాయ అవగాహన అనుభవ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొంతున్న నైరా కళాశాల వ్యవసాయ విద్యార్థులతో సమావేశమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి రైతులు వివిధ పంటల్లో అవలంభిస్తున్న పద్ధతులను తెలుసుకోవాలన్నారు. వారికి తెలియని విషయాలను తెలియజేయాలన్నారు.
కందిపప్పు కట్..!
రేషన్ లబ్ధిదారులకు నిలిచిన కందిపప్పు సరఫరా
కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ
మార్చినెలకు విడుదలకాని కందిపప్పు
జిల్లాలో రైస్‌కార్డులు 5,71,354
571.354 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం
లబ్ధిదారులకు బియ్యం, పంచదార మాత్రమే సరఫరా
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం
అప్రజాస్వామ్య పాలనపై మేధావుల తీర్పు
మరోసారి పెద్దల సభకు గాదె శ్రీనివాసులునాయుడు
ఉత్కంఠ పోరులో మూడోసారి ఎమ్మెల్సీగా గెలుపు
టీడీపీ, జనసేన నాయకులు సర్వశక్తులు ఒడ్డినా తప్పని
రఘువర్మ ఓటమి
కూటమి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది...
టీడీపీ, జనసేన పార్టీలు బలపర్చిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కన్నా ఆయన సమీప ప్రత్యర్థులిద్దరికీ దాదాపు 70 శాతం టీచర్లు మద్దతు పలికారంటే తొమ్మిది నెలల్లోనే ప్రజాభిప్రాయంలో ఎంత మార్పు వచ్చిందో అర్థమవుతోంది. రఘువర్మ తరఫున ఆ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, మంత్రులు ప్రత్యక్షంగా ప్రచారం చేసి, పోలింగ్ కేంద్రాల ముందు స్లిప్పులు పంచినా తీర్పు మాత్రం కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టినట్లు చెప్పారు. ఇక్కడితో కౌంట్‌డౌన్ మొదలైంది.
– మజ్జి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
సంతోషంగా ఉంది
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులనాయుడు గెలవడం సంతోషంగా ఉంది. ఇది కూటమి ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిది. ఇకనైనా ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి.
– అమరపు సూర్యనారాయణ,
పీఆర్‌టీయూ అసోసియేట్ అధ్యక్షుడు
సరఫరా కాలేదు..
రేషన్ కార్డుదారులకు మార్చినెలకు సరఫరా చేసేందుకు కందిపప్పు సరఫరా కాలేదు. జిల్లాకు నెలకు 571.354 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం పడుతుంది. ఈ నెల బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేస్తాం.
– కె.మధుసూదనరావు,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
కూటమి ప్రభుత్వానికిచెంపపెట్టు
కూటమి ప్రభుత్వానికిచెంపపెట్టు
కూటమి ప్రభుత్వానికిచెంపపెట్టు
కూటమి ప్రభుత్వానికిచెంపపెట్టు
కూటమి ప్రభుత్వానికిచెంపపెట్టు
కూటమి ప్రభుత్వానికిచెంపపెట్టు
కూటమి ప్రభుత్వానికిచెంపపెట్టు
కూటమి ప్రభుత్వానికిచెంపపెట్టు
కూటమి ప్రభుత్వానికిచెంపపెట్టు
కూటమి ప్రభుత్వానికిచెంపపెట్టు
కూటమి ప్రభుత్వానికిచెంపపెట్టు
కూటమి ప్రభుత్వానికిచెంపపెట్టు
కూటమి ప్రభుత్వానికిచెంపపెట్టు
Comments
Please login to add a commentAdd a comment