ఎల్లమ్మ గుడిలో హుండీని విరగ్గొట్టిన దుండగులు
గంట్యాడ: మండలంలోని నరవ గ్రామంలో ఉన్న ఎల్లమ్మ గుడిలో హుండీని సోమవారం రాత్రి దుండగులు విరగ్గొట్టారు. అందులో ఉన్న డబ్బులను దొంగిలించారు. అయితే ఈవిషయంపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.
డ్రోన్ సహాయంతో జూదరుల అరెస్టు
పార్వతీపురం రూరల్: పట్టణంలోని బూరాడ వీధిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద రూ.1560లు నగదును స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ ఎస్సై ఎం.గోవింద తెలిపారు. మంగళవారం పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు నిరోధించేందుకు డ్రోన్ కెమెరాను వినియోగించిన సందర్భంలో పేకాట ఆడుతున్న దృశ్యాన్ని గుర్తించి పేకాట శిబిరం వద్దకు వెళ్లి జూదరులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment