ఎడ్ల పరుగు పోటీల్లో వావిలపాడు విజేత
ప్రదర్శనలో పరుగు తీస్తున్న ఎడ్లు
వేపాడ: మండలంలోని పాటూరు సమీపంలో గాడివారి కళ్లాల వద్ద మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఎడ్ల పరుగు ప్రదర్శనలో వావిలపాడుకు చెందిన ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. కళ్లాల వద్ద అభయాంజనేయ స్వామి తీర్థమహోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో 12 ఎడ్లు జతలు పాల్గొన్నాయి. వాటిలో రెండోస్థానంలో వల్లంపూడికి చెందిన ఏడువాక సత్తిబాబు ఎడ్లు, మూడోస్థానంలో తుమ్మికాపల్లికి చెందిన జైదర్శిని ఎడ్లు, నాల్గో స్థానంలో కృష్ణారాయుడుపేటకు చెందిన గుమ్మాలమ్మ తల్లి ఎడ్లు, ఐదోస్థానంలో కలగాడకు చెందిన ఎడ్లు, ఆరోస్థానంలో వావిలపాడుకు చెందిన గండి వెంకటరావు ఎడ్లు నిలిచాయి. విజేతలకు రూ.12వేలు,10వేలు, 8వేలు, 6వేలు, 4 వేలు చొప్పున నగదు బహుమతులను గ్రామపెద్దలు, ఉత్సవ కమిటీ, దాతలు అందజేశారు. స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి మద్యాహ్నా అన్నసమారాధన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment