రక్తదానం ప్రాణదానంతో సమానం
పార్వతీపురంటౌన్: రక్తదానం.. ప్రాణదానంతో సమానమైనదని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. లైన్‌మెన్ దివస్‌ను పురస్కరించుకొని ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన ‘నేను సైతం’ రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడవచ్చన్నారు. ప్రతి ఆరుమాసాలకు రక్తదానం చేయవచ్చని, అపోహలు వీడి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
డీఆర్‌డీఏ పీడీగా సుధారాణి
పార్వతీపురంటౌన్: డీఆర్‌డీఏ పీడీగా సుధారాణి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా గ్రామీణాభివృద్ధికి తన వంతు కృషిచేయాలని కల్టెకర్ సూచించారు.
పార్వతీపురం చేరుకున్న చిన జియర్ స్వామి
● నేడు శ్రీరామపాదుకాపట్టాభిషేకం
పార్వతీపురం: పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీరామ పాదుకాపట్టాభిషేకం పూజాకార్యక్రమాలు నిర్వహించేందుకు మంగళవారం సాయంత్రం త్రిదండి చినజియర్ స్వామి పార్వతీపురం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన బెలగాంలోని వెంకటేశ్వర దేవస్థానానికి వెళ్లి భక్తులతో ముచ్చటించారు. శ్రీరామ పాదుక పట్టాభిషేకం పూజా విశిష్టతను వివరించారు. పూజల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని కోరారు. అనంతరం మైదానంలో ఏర్పాటు చేస్తున్న పాదుకాపట్టాభి షేక ప్రాంగణ ఏర్పాట్లను వికాస తరంగిణి అధ్యక్షుడు యిండుపూరు గున్నేశ్వరరావుతో కలిసి పరిశీలించారు.
జాతీయ జెండాకు అవమానం
విజయనగరం: విజయనగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది. సిద్ధాంతాలకు పేటెంట్ మా నాయకుడు అని చెప్పుకుని తిరిగే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ కార్యాలయంలోనే జాతీయ పతాకాన్ని అవమానకర రీతిలో మూలనపడేయడమే కాకుండా జెండాపై తాగిన టీ కప్పులు వేయడం ఘోర తప్పిదమని కార్యాలయానికి విచ్చేసిన పలువురు పేర్కొన్నారు. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ నాయకులు పాలవలస యశస్వి, పడాల అరుణ, గురాన అయ్యలు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న బీరువా పక్కన జాతీయ పతాకాన్ని మూలనపడేసి ఉన్న విషయాన్ని అక్కడికి విచ్చేసిన జనసేన కార్యకర్తలు చూడడమే కాకుండా వాటిపై తాగిన టీ కప్పును పడేయడం అవమానకరమని పలువురు పేర్కొంటున్నారు. జాతీయ పతాకాన్ని అవమానించిన జనసేన నాయకులు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
రక్తదానం ప్రాణదానంతో సమానం
రక్తదానం ప్రాణదానంతో సమానం
Comments
Please login to add a commentAdd a comment