కూటమి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ఆరంభం
వీరఘట్టం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలు బలపరిచిన పాకలపాటి రఘువర్మకు ఓటుతో గురువులు బుద్ధిచెప్పారని పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. ప్రలోభాలతో అభ్యర్థులను గెలిపించలేరన్నది స్పష్టంచేశారన్నారు. వండువలో మీడియాతో ఆమె మంగళవారం మాట్లాడారు. గత తొమ్మిది నెలల కూటమి పాలనపై విసిగిన ఉపాధ్యాయులు ఓటుతో తమ నిరసన తెలిపారన్నారు. కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని మంత్రి సంధ్యారాణి పాలకొండ ప్రాంతంలో ముమ్మర ప్రచారంచేశారని, ఆమె మాటలను ఉపాధ్యాయులు నమ్మలేదన్నారు. ఇటీవల పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పదవి దక్కించుకోవాలని మంత్రి సంధ్యారాణి చేసిన ప్రయత్నాలు సైతం బెడిసికొట్టాయన్నారు. కూటమి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందన్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు రాకముందే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే కళావతి
Comments
Please login to add a commentAdd a comment