●నేడు మద్యం షాపుల లాటరీ
‘లాటరీ’ ద్వారా కేటాయింపు...
జిల్లా యూనిట్‌గా కోటా ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వం ఫీజు నిర్ణయించింది. ఏ4 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. ఫిబ్రవరి 6వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించారు. గత నెల 10వ తేదీన ఉభయ జిల్లాల్లో లాటరీ తీయడానికి ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాయిదా వేశారు. ఆ ప్రక్రియను ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ బి.శ్రీనాథుడు తెలిపారు. విజయనగరం జిల్లాలోని దుకాణాలకు సంబంధించి కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని ఆడిటోరియంలో ఉదయం 9 గంటలకు లాటరీ తీస్తారు. పార్వతీపురం మన్యం జిల్లాలో దరఖాస్తుదారులకు కూడా అదే సమయానికి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో లాటరీ నిర్వహిస్తారు.
● కల్లుగీత, సొండి కులాలకు విజయనగరం జిల్లాలో 16, పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు షాపులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉభయ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కల్లుగీత, సొండి కులాలకు కేటాయించిన 20 మద్యం షాపులకు సంబంధించిన లాటరీ ప్రక్రియ గురువారం నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికే విజయనగరం జిల్లాలో 153, పార్వతీపురం మన్యం జిల్లాలో 52 మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించిన సంగతి తెలిసిందే. వాటికి ఇప్పుడీ 20 అదనం. జిల్లా యూనిట్‌గా కల్లు గీత, సొండి సామాజికవర్గాల వారికి వీటిని కేటాయించారు. శెట్టిబలిజ, యాత, సెగిడి, శ్రీసైన, సొండి సామాజిక వర్గాలకు చెందినవారు విజయనగరం జిల్లాలోని 16 దుకాణాల్లో కోటా ప్రకారం ఎక్కడివాటికై నా దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఇచ్చారు. అలా 308 దరఖాస్తులు వచ్చాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో శ్రీసైన, సెగిడి, సొండి కులస్తులు నాలుగు దుకాణాల్లో కోటా ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. దీంతో 60 దరఖాస్తులు దాఖలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment