గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పెంపు
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ దరఖాస్తుకు ఈ నెల 13 వరకు గడువు పెంచినట్టు గురుకులాల సమన్వయకర్త శంబాన రూపవతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.‘ఏపీపీఆర్‌ఏజీసీఈటీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఐఎన్’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
సీతంపేట: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలు, గురుకులాల ప్రిన్సిపాల్స్‌తో ఐటీడీఏలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ముఖ్యమైన ప్రశ్న లు, జవాబులపై తర్ఫీదు ఇవ్వాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో డీడీ అన్నదొర, డిప్యూ టీ ఈఓ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.
జీడిపప్పు పరిశ్రమ ఏర్పాట్లు పరిశీలన
పార్వతీపురంటౌన్: స్థానిక వ్యవసాయ మార్కె ట్ యార్డు గోదాంలో జీడి పరిశ్రమ ఏర్పాటు అనుకూలతలను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ గురువారం పరిశీలించారు. సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించారు. యంత్రాల ఏర్పా టు, ముడి సరుకు నిల్వ, అవసరమైన వసతు ల కల్పన అంశాలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. జీడి పరిశ్రమ స్థాపనతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పరిశ్రమ కు ప్రోత్సాహం లభిస్తుందని వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన ఔత్సాహికులకు అనుమతులను త్వరితగతిన మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్‌డీఏ పీడీ సుధారాణి పాల్గొన్నారు.
గీత కార్మికులకు మద్యం
దుకాణాల కేటాయింపు
పార్వతీపురంటౌన్: జిల్లాలోని నాలుగు మద్యం దుకాణాలను గీత, సొండి కులాల వారికి లాటరీ పద్ధతిలో కేటాయించినట్టు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం లాటరీ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2024–26 సంవత్సరానికి 4 మద్యం దుకాణాలకు 60 దరఖాస్తులు వచ్చాయన్నారు. పార్వతీపురం, సాలూరు, వీరఘట్టం, పాలకొండలోని మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సమక్షంలో లాటరీ తీసి దుకాణాలను కేటాయించారు. రిజర్వు షాపులకు రూ.1.20 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. లాటరీలో షాపులు దక్కించుకున్న వారి నుంచి లైసెన్సు ఫీజు కింద రూ.20,83,335 ఆదాయం లభించినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ ఎ.శ్రీరంగం, సీఐలు బి.నర్సింగరావు, జి.దాసు, కె.సూర్యకుమారి, వీవీఎస్ శేఖర్‌బాబు, పి.శ్రీనివాసరావు, పి.మురళీధర్, సిబ్బంది పాల్గొన్నారు.
రేపు జాతీయ లోక్ అదాలత్
విజయనగరం లీగల్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నెల 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు బి.సాయికళ్యాణ్ చక్రవర్తి కోరారు. రాజీపడదగిన క్రిమినల్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment