మహిళల పట్ల గౌరవంతో మెలగాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
పార్వతీపురంటౌన్: సమాజ, కుటుంబ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించే మహిళల పట్ల ప్రతిఒక్కరూ గౌరవంతో మెలగాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2కె రన్‌ను శుక్రవారం ఉదయం ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సముదాయం(ఆర్‌సీఎం) నుంచి కలెక్టరేట్ వరకు 2కె రన్ సాగింది. అక్కడ మానవహారాన్ని ఏర్పాటుచేసి అధికారులు, విద్యార్థులతో మహిళాదినోత్సవం ప్రాధాన్యతను వివరిస్తూ కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. మహిళలు ఏ రంగంలోనూ పురుషుల కంటే తక్కువ కాదని, వారిని వారు ప్రతిక్షణం నిరూపించుకుంటున్నారని తెలిపారు. విద్య, వైద్యం, వ్యాపారం, రాజకీయాలు, క్రీడలు, నటన, టెక్నాలజీ, బ్యాంకింగ్, హెల్త్ కేర్, అంతరిక్షం, ఇంటి బాధ్యతలతో సహా పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ, మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. రంగం ఏదైనా, ఎంత కష్టమైనా ఉన్నత శిఖరాలను చేరుకొని పురుషులకు తామేమీ తీసిపోమని తెలియజేస్తున్నారని కితాబిచ్చారు. శనివారం నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారి డా.టి.కనకదుర్గ, జిల్లా విద్యాశాఖ అధికారి డా.ఎస్.తిరుపతినాయుడు, వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి టి.జగన్‌మోహన్‌రావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వట్టిగెడ్డ పరిశీలన
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని రావాడ రామభద్రపురం వద్ద ఉన్న ఒట్టిగెడ్డ ప్రాజెక్టును కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఆయకట్టు, ప్రాజెక్టు పరిస్థితిని సాగునీటి సంఘ సభ్యులను అడిగితెలుసుకున్నారు. అనంతరం స్థానిక పీహెచ్‌సీను సందర్శించారు. పీహెచ్‌సీలో అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. సిబ్బంది కొరత, సమస్యలను వైద్యుడు సీహెచ్ శంకరరావును అడిగి తెలుసుకున్నారు. గిరిజన సంక్షేమ పాఠశాల ఆవరణలో పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. సమయం వృథాకాకుండా చదవాలని, మంచి మార్కులు సాధించాలని ఉద్బోధించారు.
మహిళల పట్ల గౌరవంతో మెలగాలి
Comments
Please login to add a commentAdd a comment