సారా నిర్మూలనకు ‘నవోదయం 2.0
విజయనగరం క్రైమ్: సారా నిర్మూలనకు ‘నవోదయం 2.0’ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఉమ్మడి విజయనగరం జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ పైడి రామచంద్రరావు తెలిపారు. విజయనగరం ప్రదీప్‌నగరలోని ఎకై ్సజ్‌శాఖ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరం జిల్లాలో 26, పార్వతీపురం మన్యం జిల్లాలో 137 గ్రామాలను సారా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామన్నారు. ఒక్కో ఎకై ్సజ్ అధికారికి రెండు నుంచి మూడు గ్రామాలు దత్తత ఇచ్చి ఆయా గ్రామాల్లో సారా నిర్మూలనకు కృషిచేస్తామని చెప్పారు. దీనికోసం సర్పంచ్, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, స్థానిక ఎకై ్సజ్ అధికారి, మహిళా సంఘాల సభ్యులతో గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. మండల స్థాయి కమిటీలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ, ఎఫ్‌ఆర్‌ఓ, జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్, ఎస్పీ, జిల్లా ఎకై ్సజ్ అధికారి, అటవీ అధికారి ఉంటారని చెప్పారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ అమలుచేస్తామని హెచ్చరించారు. గతేడాది అక్టోబర్ నుంచి విజయనగరం, పార్వతీపురం(మన్యం) జిల్లాల్లో 360 కేసులు నమోదుచేసి 210 మందిని అరెస్టు చేశామన్నారు. సారా తయారు చేసినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా, విక్రయించినా టోల్ ఫ్రీ నంబర్ 14405కి, విజయనగరం కంట్రోల్ రూమ్‌నంబర్ 08922 274865, పార్వతీపురం కంట్రోల్ రూమ్ నంబర్– 08963222778కి సమాచారం అందజేయాలని కోరారు. ఆయా వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment