టేకు, మామిడి, జీడిచెట్లు దగ్ధం
బలిజిపేట: మండలంలోని మిర్తివలస గ్రామసమీపంలో మిర్తివలస, తుమరాడ రెవెన్యూ పరిధిలో ఉండే టేకు, మామిడి, జీడితోటల్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించడంతో చెట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 18మంది రైతులకు చెందిన సుమారు 2,580టేకుచెట్లు, 307మామిడి, 170జీడి చెట్లు కాలిపోయాయని రైతులు తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కావడంతో మంటలు ఆర్పేందుకు అవకాశం లేకవడంతో చెట్లు కాలిపోయాయని రైతులు వాపోయారు. రెవెన్యూ సిబ్బంది నష్టాన్ని అంచనా వేశారని రైతులు తెలిపారు. ఈ ప్రమాదంలో డొక్కర రాము, ప్రగడ సోములయ్య, సాలీల సుశీల, శ్రీరాములు, పోలిరాజు, పైడితల్లి, ఈశ్వరరావు, గుడుపూరు గణపతి, జి.లక్ష్మణ, ఎం.పైడిరాజు, పి.రామారావు, జి.అచ్చియ్య, పైడయ్య, ఆర్. తిరుపతి, ఎస్.శివకృష్ణ, గంగయ్య, జి.సత్యం, ఎస్.సత్యం, మజ్జియ్య తదితరుల రైతులకు సంబంధించిన తోటల్లోని చెట్లు దగ్థమయ్యాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment