మహిళా క్రీడాపోటీలతో ఆనందం
విజయనగరం అర్బన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీఎన్‌జీవో జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ స్టేడియంలో శుక్రవారం జరిగిన క్రీడా పోటీలు మహిళా ఉద్యోగుల్లో ఆనందం నింపాయి. తొలుత పోటీలను విజయనగరం ఆర్‌డీఓ దాట్ల కీర్తి గాల్లో బెలూన్‌లు ఎగరవేసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన మహిళా ఉద్యోగులు అధికసంఖ్యలో ఉత్సాహవంతంగా పాల్గొని పోటీల్లో ప్రతిభ చూపారు. కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్, షటిల్ బాడ్మింటన్, మ్యూజికల్ చైర్ తదితర క్రీడల్లో అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. పోటీలను కె.భాను, పి.అదిలక్ష్మి, వి.సౌదామిని, ఎస్.విజయలక్ష్మి, పి.భారతీదేవి, అనురాధ నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డీవీరమణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.శ్రీధర్‌బాబు, ఎ.సురేష్, జీవీఆర్‌ఎస్‌కిశోర్, వై.ఆనంద్‌కుమార్, గోపీనాథ్, జిల్లా కోశాధికారి ఎస్‌వీసుధాకర్, ఎ.కనకరాజు, ఎల్.తవుడు, కేవీశ్రీను, జిల్లా మహిళా విభాగం చైర్‌పర్సన్ కె.ఆదిలక్ష్మి, ఆర్.శ్రీసప్న, కె.రాధిక, మహిళా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మహిళా క్రీడాపోటీలతో ఆనందం
Comments
Please login to add a commentAdd a comment