ఇష్టారాజ్యంగా కంకర తరలింపు
సాలూరు రూరల్: మండలంలోని నెలిపర్తి పంచాయతీ బట్టివలస గ్రామం వెళ్లే దారిలో గడిచిన 5 రోజులుగా అక్రమంగా కంకర తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఈ వ్వవహరంలో అక్రమ కంకర తవ్వకం దారులకు తెలుగుతమ్ముళ్లు అండగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూలో ఉన్నతాధికారులను సైతం వారు మేనేజ్ చేస్తామని అక్రమార్కులకు భరోసా ఇస్తున్నట్లు పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కంకర తవ్వకాల్లో జేసీబీతో పాటు సుమారు 10నుంచి 15 ట్రాక్టర్లు రవాణాలో వినియోగిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం నుంచి విజయనగరం జిల్లా రామభద్రపురం మండలానికి కంకర రవాణా చేస్తున్నారు. కనీసం ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత బహిరంగంగా పక్క జిల్లాకు కంకర రవాణా జరుగుతున్నా ఇంతవరకు అధికారులు పట్టించుకోకపోవడం వెనుక కంకర అక్రమ తవ్వకాలను ఏమేరకు రెవెన్యూ అధికారులు ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
ఇష్టారాజ్యంగా కంకర తరలింపు
Comments
Please login to add a commentAdd a comment