
ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలి : ఎస్పీ
ఎన్‌డీఏకు ఎంపికై న విద్యార్థులకు సత్కారం
త్రుటిలో తప్పిన ప్రమాదం
పాలకొండ రూరల్: నిత్యం రద్ధీగా ఉండే స్థానిక ప్రధాన మార్కెట్‌కు ఆనుకుని ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ ఒక్కసారిగా నేలకొరిగింది. నెలలో రెండవ శనివారం పాఠశాలకు సెలవు కావటం, గోడకు మరోవైపు ఉన్న మార్కెట్‌లో ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఉన్నట్లుండి పెద్ద శబ్ధంతో ఈ భారీ గోడ కూలటంతో చుట్టపక్కల వారు అక్కడి చేరుకుని పరిస్థితిని పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు. ఈ ఘటనతో ఎటువంటి సమస్య తలెత్తకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పాఠశాల హెచ్‌ఎం బి.శ్రీదేవి శాఖాపరమైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు.
పార్వతీపురం రూరల్: అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం గుంటూరు, కర్నూల్ రేంజ్‌కు సంబంధించిన 35మంది ప్రొబేషనరీ ఎస్‌ఐలను ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం పార్వతీపురం మన్యం జిల్లాకు కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో శిక్షణ నిమిత్తం వచ్చిన ఎస్‌ఐలు ఎస్పీ మాధవ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ వారితో మాట్లాడుతూ ప్రజలకు పోలీసు శాఖ ద్వారా అత్యుత్తమ సేవలందించాలన్నారు. విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, క్రమ శిక్షణ, నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనంగా సేవలందించాలన్నారు. ప్రతీ ఒక్కరు ఈ శిక్షణలో టెక్నాలజీని ఉపయోగించి ఉత్తమ ఫలితాలను రాబట్టి పోలీసు శాఖ ప్రజలకు మరింత సేవలందించేలా చూడాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మృదు స్వభావంతో మెలగాలన్నారు. ఎఫ్‌ఐఆర్ దర్యాప్తుకు సంబంధించిన రికార్డులు రాయడం గురించి క్షుణ్ణంగా తెలుసుకొని, కేసులను ఏ విధంగా ఛేదించాలి, సీసీటీఎన్‌ఎస్, డ్రోన్స్‌ను ఉపయోగించడం, పెట్రోలింగ్, సీసీ కెమెరాలను ఉపయోగించు విధానం, పహారా బీట్ గురించి ఎన్‌డీపీఎస్ కేసులలో చేయాల్సిన విధులు, కేసు డైరీ రాయడం, నేర స్థల పరిశీలన, పోలీసు బందోబస్తు ఏ విధంగా నిర్వహించాలో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఏ విధమైన అనుమానాలు వ్యక్తమైనా సీనియర్ అధికారులను అడిగి తెలుసుకొని నివృత్తి చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా వారికి క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఉన్న పలు పోలీసుస్టేషన్లకు కేటాయించారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ

ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలి : ఎస్పీ

ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలి : ఎస్పీ

ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలి : ఎస్పీ

ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలి : ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment