
క్రీడాకారులకు అభినందనలు
విజయనగరం: గత నెలలో మంగళగిరిలో జరిగిన 7వ పారా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన జిల్లాకు చెందిన క్రీడాకారులను పలువురు ప్రజాప్రతినిధులు శనివారం అభినందించారు. నగరంలోని రాజీవ్ క్రీడామైదానం ప్రాంగణంలో గల జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలో జరిగన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అతిధి గజపతిరాజులు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అతిధి గజపతిరాజు మాట్లాడుతూ.. ప్రతిభకు వైకల్యం అడ్డుకాదన్న విషయాన్ని పారా క్రీడాకారులు నిరూపిస్తున్నారని, ఇతర క్రీడాకారులకు ఏ మాత్రం తీసిపోని విధంగా మెడల్స్ సాధించడమే కాకుండా రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాను రెండో స్థానంలో నిలపడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలకు మెడల్స్ వేసి, మెరిట్ సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో తూర్పుకాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశస్విని, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment