వెన్నుపోటు
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025
విద్యార్థులకు
12
యువత పోరు పోస్టర్‌ను విడుదల చేస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు
యువత పోరు పోస్టర్ విడుదల
జియ్యమ్మవలస రూరల్: విద్యార్థులను, నిరుద్యోగులను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 12న జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టే నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొనాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు పిలుపునిచ్చారు. చినమేరంగిలోని తన క్యాంపు కార్యాలయంలో యువత పోరు పోస్టర్‌ను ఆదివారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, యువతకు ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి ఇస్తానన్న ఏ ఒక్క హామీను నిలబెట్టుకోనందున రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమానికి యువత నాంది పలకాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కోట రమేష్‌నాయుడు, గరుగుబిల్లి మండల అధ్యక్షుడు కేతిరెడ్డి అచ్యుతరావు, వైస్ ఎంపీపీ సంపత్‌కుమార్ వైఎస్సార్‌సీపీ నాయకులు ఎం.కిషోర్, దత్తి శంకరరావు, కె.వెంకటనాయుడు, అల్లు ఈశ్వరరావు, గంట జగన్నాధంనాయుడు, రాయగడ శేఖర్, ఎం.సింహాచలం, శివ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 12న వైఎస్సార్‌సీపీ యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసి కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్‌కు వినతిపత్రం అందజేయనున్నారు. యువతకు ప్రభుత్వం న్యాయం చేసేంతవరకు యువతకు అండగా నిలుస్తామంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
పార్వతీపురం టౌన్: విద్యార్థులను, యువతను మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారింది. గత ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీల పేరిట అధికారం చేపట్టిన కూటమి పాలకులు అన్ని వర్గాల వారిని వెన్నుపోటు పొడుస్తుంది. యువతకు ఏటా ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతీ నెల రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నేడు మోసం చేసింది. తల్లికి వందనం పథకం కింద ఏటా రూ.15వేలు తల్లుల ఖాతాలో వేస్తామని చెప్పి నేడు ఆ హామీని మరిచింది. ఫీజు రీయింబర్స్‌మెంటు విషయంలో కూడా మాట తప్పింది. ఎన్నికల వేళ ఇచ్చిన ఈ హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న జిల్లా కేంద్రంలో యువత పోరు కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది.
నిరుద్యోగులకు అన్యాయం
కూటమి ప్రభుత్వంపై యువతలో అసంతృప్తి వ్యక్తమవుతుంది. జిల్లాలో సుమారు 92వేల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని, లేకుంటే రూ.3వేలు ప్రతీ నెల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందంటూ యువత మండి పడుతున్నారు. నిరుద్యోగ భృతికి అవసరమైన నిధులు గత బడ్జెట్‌లో కేటాయించకపోవడంతో ఈ పథకంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
విద్యార్ధులకు తీవ్ర ఇబ్బందులు
కూటమి పాలనలో విద్యార్థులు అన్ని విధాల ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో జిల్లాలో సుమారు 16 వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బడ్జెట్‌లో నిధులు తక్కువగా కేటాయించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
న్యూస్‌రీల్
న
యువత
పోరు
మోసపూరిత ప్రభుత్వం
– అలజంగి జోగారావు,
మాజీ ఎమ్మెల్యే
ఈ నెల 12న వైఎస్సార్‌సీపీ యువత పోరు
అదే రోజు కలెక్టర్‌కు వినతిపత్రాల అందజేత
నిలిచిన విద్యార్థి పథకాలు
నిరుద్యోగ భృతి ఊసెత్తని కూటమి సర్కార్
కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలిచ్చి అధికారం చేపట్టింది. సుమారు 10 నెలలు పాలన పూర్తి చేసినా యువత, నిరుద్యోగులు, విద్యార్థులకు అన్యాయం చేస్తుంది. విద్యాదీవెన బకాయిలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా ఈ నెల 12న యువత పోరు కార్యక్రమంలో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తాం.
వెన్నుపోటు
వెన్నుపోటు
వెన్నుపోటు
వెన్నుపోటు
Comments
Please login to add a commentAdd a comment