చినమేరంగి సర్కిల్ ఆఫీసుకు ఐదుగురు ట్రైనీ ఎస్సైలు
జియ్యమ్మవలస రూరల్: పోలీస్ సూపరింటెండెంట్ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి ఆదేశాల మేరకు జియ్యమ్మవలస మండలంలోని చినమేరంగి సర్కిల్ ఆఫీస్‌లో ఐదుగురు ట్రైనీ ఎస్సైలు ఆదివారం విధుల్లో చేరారు. ఈ మేరకు ఎస్సై పి.అనీష్ వారిని అభినందిస్తూ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన చినమేరంగి, జియ్యమ్మవలస పోలీస్‌స్టేషన్‌లలో ట్రైనీ ఎస్సైలు నియమితులయ్యారని, వారంతా సీఐ వీటీ తిరుపతిరావు పర్యవేక్షణలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కమ్యూనిటీ పోలీసులతో పాటు వారిలో చినమేరంగికి ఎం.అనిల్ రెడ్డి, వి.మణికంఠేశ్వర రెడ్డి, వై జ్యోతిలను నియమించగా, జియ్యమ్మవలస పోలీస్‌స్టేషన్‌లో వి.నారాయణరెడ్డి, వి ప్రదీప్‌లు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment