విద్యార్థులకు ఇస్రో పిలుపు
● అంతరిక్షం.. స్పేస్ అప్లికేషన్‌పై
అవగాహన
● 9వ తరగతి విద్యార్థులకు చక్కటి
అవకాశం
● మార్చి 23 వరకు దరఖాస్తుల స్వీకరణ
పాలకొండ రూరల్: విద్యార్థి దశ నుంచి సైన్స్‌పై మక్కువ చూపుతూ..నూతన ఆవిష్కరణల పట్ల ఉత్సాహం చూపే విద్యార్థులను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రోత్సహిస్తోంది. యువిక (యుంగ్ సైంటిస్ట్)–2025 పేరిట ఉపగ్రహ ప్రయోగాలను తెలుసుకునేందుకు, శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు 9వ తరగతి విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది.
లక్ష్యాలు..
● భారత అంతరిక్ష పరిశోధనలను విద్యార్థులకు పరిచయం చేయడం
● విద్యార్థులను స్పేస్ టెక్నాలజీ వైపు ప్రోత్సహించడం
● అంతరిక్ష పరిశోధకులుగా వారిని సిద్ధం చేయడం
దరఖాస్తు చేసే విధానం..
ఈ నెల 23వ తేదీలోగా విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను ఏప్రిల్ 7వ తేదీనాటికి వడపోసి ఎంపికై న విద్యార్తుల జాబితాలను విడుదల చేస్తారు. మే నెల 18 నుంచి విద్యార్థులను ఆహ్వానిస్తారు. 19 నుంచి 30వ తేదీ వరకూ యువికా–25 కార్యక్రమం చేపడతారు. మే 31న ముగింపు కార్యక్రమం జరుగతుంది. అదే రోజు ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. ఎంపికై న విద్యార్థులకు ప్రయాణ, భోజన, వసతి ఏర్పాట్లును ఇస్రో పూర్తి ఉచితంగా అందజేస్తుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో 14 రోజులు ఇస్రోకు చెందిన స్పెస్ సెంటర్లకు తీసుకువెళ్తారు. అక్కడి వింతలు, విశేషాలు, సప్తగహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారు.
ఎవరు అర్హులు
● ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు
● ఆన్‌లైన్ పరీక్షలో ప్రతిభ కనపర్చిన విద్యార్ధులు
● 8వ తరగతిలో సాధించిన మార్కుల్లో 50 శాతం, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొంటే వాటి ఆధారంగా 2 నుంచి 10 శాతం, ఆన్‌లైన్ క్విజ్ పోటీల్లో చూపించిన ప్రతిభకు 10 శాతం వెయిటేజీ అందిస్తారు. ఎన్‌సీసీ, స్కౌట్, గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం, పల్లె ప్రాంతాలకు చెందినవారికి 15 శాతం ప్రాధాన్యం కల్పిస్తారు.
భావిశాస్త్ర వేత్తలకు ప్రోత్సాహం
భావిశాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ఇస్రో చేపడుతున్న యువికా కార్యక్రామాన్ని అర్హతగల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. సంబంధిత పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు పిల్లలకు సహకరించాలి. జిల్లా పరిధిలో డీవీఈఓలు, ఎంఈఓలు ఈ విషయంపై వారి పరిధిలో యంత్రాంగాన్ని చైతన్యపర్చాలి. పెద్ద సంఖ్యలో విద్యార్థులతో దరఖాస్తు చేయించాలి. – ఎన్.తిరుపతినాయుడు,
జిల్లా విద్యాశాఖాధికారి, పార్వతీపురం మన్యం
జిల్లావ్యాప్తంగా సంసిద్ధం
గతంలో నిర్వహించిన అనేక సైన్స్ ఎగ్జిబీషన్లు, పోటీ పరీక్షల్లో మన జిల్లా విద్యార్థులు సత్తాచాటి జాతీయ స్థాయిలో వారి ప్రదర్శనలతో అబ్బురపర్చారు. ఇదే స్ఫూర్తితో పెద్ద సంఖ్యలో అర్హత గత విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే 40 వరకూ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేశారు. ప్రస్తుత వేసవి సెలవుల్లో సమయం వృథా కాకుండా ఈ పర్యటనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
– జి.లక్ష్మణరావు, జిల్లా సైన్స్ అధికారి, పార్వతీపురం మన్యం
విద్యార్థులకు ఇస్రో పిలుపు
విద్యార్థులకు ఇస్రో పిలుపు
Comments
Please login to add a commentAdd a comment