సెరీకల్చర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలి
పార్వతీపురంటౌన్: రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రతి ఏడాది ప్రాథమిక రంగాలు వృద్ధి సాధించాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సూచించారు. ఈ మేరకు మంగళవారం సంబంధిత శాఖాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సేంద్రియ వ్యవసాయం ఎక్కువగా జరుగుతుందని, సేంద్రియ పంటల రైతులను ప్రోత్సహించాలన్నారు. నిమ్మగడ్డికి మంచి గిరాకీ ఉందని, అందుకు తగిన ప్రణాళికలు రూపొందించి రైతులను ప్రొత్సహించాలని కోరారు. వ్యవసాయ పంటల్లో ఏటా 15 శాతానికి మించి వృద్ధి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పట్టు, వశుసంవర్థక శాఖాధికారులు కె. రాబర్ట్‌పాల్, బి.శ్యామల, వి.తిరుపతయ్య, ఏవీ సాల్మన్ రాజు, డా.ఎస్ మన్మథరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment