విజయనగరం ఫోర్ట్: ఉపాధిహామీ పథకంలో పనిచేసే మేట్లకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు ఇప్పిస్తానని గుర్ల ఉపాధి హామీ పథకం ఏపీఓపై ఆరోపణలు వచ్చాయి. కలెక్టరేట్‌లోలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గార రామలక్ష్మి అనే మహిళ ఏపీఓపై ఇప్పటికే రెండుసార్లు ఫిర్యాదు చేసింది. అయినా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
● గంట్యాడ ఉపాధి హామీ పథకం ఏపీఓ లక్షలాది రుపాయల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతనిపై ఉపాధి పథకం రాష్ట్రస్థాయి అధికారులు విచారణ చేపట్టారు. మండలంలోని నరవ, లక్కిడాం, పెణసాం, మధుపాడ తదితర గ్రామాల్లో ఉపాధి హామీ వేతనదారుల నుంచి లక్షలాది రుపాయలు వసూలు చేసినట్లు ఏపీఓపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ ఆ ఏపీఓపై ఎటువంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
● జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన సిబ్బంది అధికారులకు కొంత మొత్తం ముట్టజెప్పి మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది సైతం అక్రమాలకు పాల్పడడానికి సాహసిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో స్థాయిని బట్టి ఉపాధి సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డిప్యూటీ సీఎం మాటలు ప్రకటనలకే పరిమితమా..?
నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నీటి యాజమాన్య శాఖలో అవినీతికి తావు ఉండదు. ఎవరైనా అక్రమాలకు, అవినీతికి పాల్పడితే వారి తాట తీస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు సందర్బాల్లో వాఖ్యనించారు. డ్వామా అధికారులు, సిబ్బందిపై పెద్ద ఎత్తున అవినీతి అరోపణలు వచ్చినప్పటికీ ఏమీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని అక్రమాలే బయటకు
నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో జిల్లాలో పలు చోట్ల అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలపై కొన్ని చోట్ల ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ధైర్యం చేసి ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఉపాధి హామీ పథకం అధికారులు, సిబ్బంది అక్రమాల గురించి ప్రస్తావించేందుకు డ్వామా పీడీ ఎస్.శారదాదేవి వద్ద సాక్షి ప్రస్తావించడానికి ప్రయత్నించగా ఆమె స్పందించలేదు.
అక్రమార్కులకు అండగా అధికారులు
అవినీతికి పాల్పడిన వారిపై
చర్యలకు వెనుకడుగు
గుర్ల, గంట్యాడ ఏపీఓలపై అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు శూన్యం
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు ఇప్పిస్తానని
డబ్బులు తీసుకున్నట్లు గుర్ల ఏపీఓపై ఆరోపణలు
లక్షలాది రుపాయల అక్రమాలకు పాల్పడినట్లు గంట్యాడ ఏపీఓపై
ఆరోపణలు