ప్రాజెక్టుల నిధులకు ప్రతిపాదనలు | - | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల నిధులకు ప్రతిపాదనలు

Published Sat, Mar 22 2025 1:39 AM | Last Updated on Sat, Mar 22 2025 1:35 AM

విజయనగరం అర్బన్‌: జిల్లా వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు సాధించాలంటే తోటపల్లి కుడి ప్రధాన కాలువ, తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టులు పూర్తి కావాలి... దీనికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. ఆయా ప్రాజెక్టుల పనులు, భూసేకరణ, పునరావాసం పూర్తి చేసేందుకు ఏ మేరకు నిధులు అవసరమవుతాయో జలవనరుల శాఖ అధికారులు నివేదిక అందజేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం మాట్లాడారు. తోటపల్లి కుడి ప్రధాన కాలువ, తారకరామ సాగరం ప్రాజెక్టులను పూర్తిచేస్తే సుమారు 50 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. వ్యవసాయ రంగంలో అదనపు ఉత్పత్తిని, ఆదాయాన్ని సాధించే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు నగరానికి మంచినీటి సరఫరా, భోగాపురం ఎయిర్‌పోర్టుకు నీటి సరఫరా జరిగే అవకాశం ఉన్నందున ఈ ప్రాజె క్టు త్వరగా పూర్తిచేయాల్సిన అవసరాన్ని వివరిస్తా మని చెప్పారు. కలెక్టర్ల సదస్సు మార్చి 25, 26 తేదీల్లో అమరావతిలో జరగనుందని, జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై ప్రజంటేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వివిధ శాఖల అధికారులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంతమేరకు లక్ష్యాలు సాధించగలమో పేర్కొంటూ వాస్తవిక అంచనాలను మాత్రమే ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement