● సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి
విజయనగరం టౌన్: విద్యలనగరం విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దివ్యాశీస్సులతో సంస్కృతి, సంప్రదాయ పరిరక్షణకు వేద సంస్కృతాంధ్ర భాషలలో ఎవరైతే స్థానికంగా విశేష కృషిచేసి ఉంటారో అటువంటి పెద్దలను సముచిత రీతిలో సంస్థ వార్షికోత్సవం రోజున సత్కరించుకునేందుకు ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు వాగ్దేవి సమారాధనం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ధర్మపురి రోడ్డులో ఉన్న సంస్థ ఆవరణలో ఆదివారం వివరాలు వెల్లడించారు. ఉగాది పర్వదినం, సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ దార్లపూడి శివరామకృష్ణకు వాగ్దేవి సాహిత్య స్రష్ట అనే పురస్కారంతో, డాక్టర్ బొంతు గురవయ్యకు వాగ్దేవి వరపుత్ర పురస్కారంతో సత్కరించుకుంటున్నామని తెలిపా రు. సంస్ధ ప్రధానకార్యదర్శి డాక్టర్ నాగమల్లిక మా ట్లాడుతూ గురజాడ గ్రంథాలయంలో విశ్వావసునామ సంవత్సర ఉగాది రోజున ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాహిత్య పర్యవేక్షకులు సాహితి, రుగ్వేదాచార్యులు రాంభట్ల సన్యాసిరాజు, శంబర కృష్ణ తదితరులు పాల్గొన్నారు.