
● విశ్వావసుకు స్వాగతం
ఇంటి ముంగిట మామిడి తోరణాలు... రైతన్నల ఏరువాక సన్నాహాలు... వేద పండితుల పంచాంగ శ్రవణాలు.. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టే ఉగాది పర్వదినం అందరిలోనూ సంతోషం నింపాలి. కోయిల గానంలా ప్రతి ఒక్కరి జీవితం సాగిపోవాలి. ప్రతి ఇంటా ఉగాది వేడుకగా సాగాలి. మామిడి పచ్చడిలోని షడ్రుచుల సమ్మేళనమే జీవితమని గుర్తెరిగి సాగిపోవాలి. చైత్రమాసపు చెలిౖమై వచ్చిన తెలుగు సంవత్సరాదికి విజయనగరం జిల్లా కేంద్రంలోని నర్తనశాల డ్యాన్స్ అకాడమీ చిన్నారులు సంప్రదాయబద్ధంగా శనివారం ముందస్తు స్వాగతం పలికారు.
– సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం