
ఫాంపాండ్స్‌తో భూగర్భ జలాల పెంపు
కొమరాడ: ఉపాధిహామీ నిధులతో చేపట్టే ఫాం పాండ్స్‌తో భూగర్భ జలాలు పెరిగి సాగునీటి కొరత తీరుతుందని జిల్లా ప్రత్యేక అధికారి నారాయణ భరత్ గుప్తా తెలిపారు. కొమరాడ మండలం విక్రంపురం పంచాయతీ పరిధిలోని ఉపాధిహామీ పనులను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, డ్వామా పీడీతో కలిసి మంగళవారం పరిశీలించారు. పశువుల నీటితొట్టెల నిర్మాణ పనులను ప్రారంభించారు. తమ్మన్నదొరవలస గ్రామంలో నిర్మించిన మినీ గోకులాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. నందాపురం గ్రామంలో నిర్మితమవుతున్న ఫారం పాండ్స్‌ను తనిఖీ చేశారు. ఏటా సాగు భూమిని సారవంతం చేసుకుంటూ బహుళ పంటల వైపు సాగితే అధిక లాభాలు వస్తాయన్నారు. చేపల పెంపకానికి ఫాంపాండ్లను వినియోగించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఇంజినీరింగ్ శాఖ అధికారులు, స్థానిక నాయకలు కళింగి మల్లేశ్వరరావు, దేవకోటి వెంకటినాయుడు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రత్యేక అధికారి నారాయణ భరత్ గుప్తా