
ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి
శ్రీకాకుళం రూరల్: విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని, పకడ్బందీ ప్రణాళికతో లక్ష్యా న్ని చేరుకోవచ్చునని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు అన్నారు. గురువారం రాగోలు జెమ్స్ ఆస్పత్రి ఆడిటోరియంలో వైద్య, ఆరోగ్య రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ కోర్సు చదివితే భవిష్యత్‌లో బాగా స్థిరపడతామో ఆ కోర్సునే ఎంచుకోవాలన్నారు. అందులో తగిన నైపుణ్యత సాధిస్తే ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందన్నారు. తల్లిదండ్రులపై ఆధారపడకుండా సొంతంగా ఎలా ఎదగాలో అలవర్చుకోవాలన్నారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో జెమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్‌రెడ్డి, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీలలిత, బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.