దసరా వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

దసరా వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

Oct 11 2024 2:00 AM | Updated on Oct 11 2024 2:00 AM

దసరా

దసరా వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

కోల్‌సిటీ(రామగుండం): విజయ దశమి సందర్భంగా నగరంలో చేపట్టే ఉత్సవాలు బ్రహ్మాండంగా ఉండాలని, ఇందుకోసం అధికారులు పకడ్బందీ ఏ ర్పాట్లు చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ సూచించారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించిన దసరా ఉత్సవాల సన్నాహక సమావేశంలో మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. సింగరేణి సహకారంతో జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఈనెల 12న సాయంత్రం చేప ట్టే ఉత్సవాల్లో ప్రజలను ఆహ్లాదం పంచేలా ఏర్పా ట్లు చేయాలని ఎమ్మెల్యే అన్నారు. బతుకమ్మ, దస రా ఉత్సవాలకు ఎన్టీపీసీ రూ.25లక్షలు కేటాయించడం హర్షణీయమన్నారు. రామ్‌లీలాతోపాటు ప్ర జలకు పూర్తిస్థాయిలో వినోదం అందించే సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని తెలిపారు. లేజర్‌ షో, ఫుడ్‌ స్టాల్స్‌, ఆట యంత్రాలు కూడా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తు చేపట్టాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్‌, ఏసీపీ రమేశ్‌, నర్సయ్య, ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌, ఎన్టీపీసీ అధికారి సూర్యనారాయణ, ట్రాన్స్‌కో ఏడీఈ శ్రీనివాస్‌, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్ల పరిశీలన

గోదావరిఖని: స్థానిక సింగరేణి స్టేడియంలో ఈనెల 12న నిర్వహించే దసరా వేడుకల ఏర్పాట్లను గోదావరిఖని ఏసీపీ రమేశ్‌, సింగరేణి ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌ గురువారం పరిశీలించారు. రామ్‌లీలా కార్యక్రమం సందర్భంగా పెద్దసంఖ్యలో తరలి వచ్చే కార్మిక కుటుంబాలు, నగర ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఫుడ్‌స్టాల్స్‌తోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బల్దియా అధికారులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బొంతల రాజేశ్‌, మహంకాళి స్వామి, దీటి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌

అధికారులతో సమీక్ష

దసరా వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు1
1/1

దసరా వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement