
కలెక్టరేట్‌లో క్యాంటీన్ వివాదం
సాక్షి,పెద్దపల్లి: లీజు గడువు ముగియక ముందే మ రోమహిళా సంఘానికి క్యాంటీన్ నిర్వహణ బాధ్య తలు అప్పగించడంతో వివాదం చేలరేగింది. లీజు గడువు ముగియకుండానే వేరేవారికి ఎలా కేటాయిస్తారని నిర్వాహకులు కోర్టు మెట్లు ఎక్కడం కలక లం రేపుతోంది. అంతేకాదు.. మహిళా సంఘం సభ్యులు కలెక్టరేట్‌లోని క్యాంటీన్ వద్ద మీడియా సమావేశం నిర్వహిండంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. బాధితురాలి కథనం ప్రకారం.. సిబ్బంది, సందర్శకుల కోసం కలెక్టరేట్‌లో క్యాంటీన్ ఏర్పాటు చేశారు. గత కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ 1 ఏప్రిల్ 2024 నుంచి 31 మార్చి 2027వ తేదీ వరకు గడువు ఉండేలా రంగంపల్లికి చెందిన మహతి మహిళా గ్రూప్ సభ్యురాలు బొంతు తారలక్ష్మికి లీజుకు ఇ చ్చారు. ఆ మహిళా గ్రూప్ ఒప్పందం గడువు పూర్తికాకముందే ప్రస్తుత కలెక్టర్.. క్యాంటీన్‌ను ఖాళీ చే యాలని సదరు మహిళా సంఘానికి నోటీసులు జా రీచేశారు. ఇదేసమయంలో రాఘవాపూర్ గ్రామాని కి చెందిన పద్మావతి స్వశక్తి మహిళా సంఘానికి డీఆర్‌డీఏ అధికారులు క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దీంతో కొత్తవారు 15రోజులుగా క్యాంటీన్ ఆవరణలో టీ, స్నాక్స్ విక్రయిస్తున్నారు. తమను అర్ధంతరంగా ఖాళీ చేయించడంతో తారల క్ష్మి మహిళా సంఘం స్థానిక కోర్టును ఆశ్రయించింది. అయితే, క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు తమ కు వర్తించేలా కోర్టు ఆదేశాలు ఇచ్చిందని, దీంతో తాము క్యాంటీన్‌లో సామాన్లు నిల్వచేసి తాళం వేసు కున్నట్లు తారలక్ష్మి తెలిపారు. శనివారం వెళ్లి చూడ గా తాళం పగుగొట్టి సామాన్లు చిందరవందర చేసి నట్లు వివరించింది. ఈ విషయంపై ఠాణాలో ఫిర్యా దు చేశామని మీడియాకు తెలిపింది. మరోవైపు.. తాము తాళం పగులగొట్టలేదని, క్యాంటీన్ వెలుపల టేబుల్ వేసుకుని టీ, స్నాక్స్ విక్రయిస్తున్నామని కొ త్త మహిళా సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.
కోర్టును ఆశ్రయించిన మహిళా సంఘం
Comments
Please login to add a commentAdd a comment