ప్రైవేట్ ఓబీలో కొనసాగిన సమ్మె
గోదావరిఖని: ప్రయివేట్ ఓబీలో మూడోరోజు మంగళవారం సమ్మె యథావిధిగా కొనసాగింది. రామగుండం రీజియన్‌లోని పీసీ పటేల్, హెచ్‌డీ, వీ9, సీ5, ఆర్‌వీఆర్ ప్రైవేట్ ఓబీల్లోని 2వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సమక్షంలో ఓబీ బాధ్యులు మంగళవా రం చర్చలు జరిపారు. కార్మికులకు రూ.4వేల వేత నం పెంచాలని, ఆరోగ్యభద్రత, ఇతర వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే ఓబీ కాంట్రాక్టు యజమాన్యాలు రూ.2వేలు పెంచేందుకు అంగీకరించినట్లు తెలిపారు. దీంతో రూ.4వేలు పెంచడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. ఓబీ యాజమాన్యాలు ముందుకు రాకపోవడంతో చర్చలు వాయిదా పడ్డాయి. కార్మికులకు న్యాయం జరిగేంతవరకు సమ్మె విరమించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment