హైరిస్క్ గర్భిణులను గుర్తించాలి
సుల్తానాబాద్(పెద్దపల్లి): హైరిస్క్ గర్భిణులను గుర్తించాలని డీఎంహెచ్‌వో అన్న ప్రసన్న కుమారి అన్నారు. హైరిస్క్ గర్భిణుల గుర్తింపు, చికిత్స తదితర అంశాలపై కలెక్టరేట్‌లో డాక్టర్ స్రవంతితో కలిసి ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, హైరిస్క్ గర్భిణుల వివరాలను అర్మాన్ యాప్‌లో నమోదు చేయాలని వివరించారు. వారికి సరైన సమయంలో సేవలు, సలహాలు అందించడం జరుగుతుందని, దీంతో మాతృ మరణాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్య కార్యకర్తల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
రికార్డుస్థాయి ఉత్పత్తి సాధించిన జీడీకే–11 గని
గోదావరిఖని(రామగుండం): సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని జీడీకే–11 గని రికార్డు స్థాయి బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఈనెల 19న 2,800 టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను, 5,500 టన్నుల బొగ్గు వెలికితీసి రికార్డు నెలకొల్పింది. ఈనెల 15న సంస్థ సీఎండీ బలరాం గనిని సందర్శించారు. ఈక్రమంలో ఉద్యోగులు ఇచ్చిన హామీ మేరకు రికార్డు స్థాయి బొగ్గు ఉత్పత్తి చేశారని, దీనికి సహకరించిన అధికారులు, కార్మికులకు ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్ అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.
లోకో పైలట్‌ల నిరాహారదీక్ష
రామగుండం: సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా చేపట్టిన నిరాహార దీక్షలో భాగంగా గురువారం రామగుండం రైల్వేస్టేషన్ ఆవరణలో స్థానిక లోకోపైలట్‌లు దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ, భారతీయ రైల్వేలో లోకోపైలట్‌ల పాత్ర ఎంతో ముఖ్యమైనదని, సరైన విశ్రాంతి ఇవ్వకుండా ఎక్కువ పనిగంటలు పని చేయిస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేవరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈసందర్భంగా కొంతమంది లోకోపైలట్‌లు సొమ్మసిల్లి పడిపోగా స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. కాగా ఈదీక్ష శిబిరాన్ని రైల్వే కార్మికసంఘాల నాయకులు వీరన్న, రాజ్‌కుమార్, సదయ్య సందర్శించి తమ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో ఆల్‌ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోషియేషన్ రామగుండం బ్రాంచ్ సెక్రటరీ సిహెచ్.రవి, ప్రెసిడెంట్ ఎన్‌కే పాల్, సచిన్, కిరణ్, వినోద్, సౌరవ్, వికాస్ పాల్గొన్నారు.
బహుగుళ్ల ఆలయ పరిధిలో
విద్యుత్ లైన్ ప్రారంభం
ముత్తారం(మంథని): మండలంలోని మచ్చుపేటలో బహుగుళ్ల ఆలయానికి వేళ్లే మార్గమధ్యలో ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ డీటీఆర్‌ను గురువారం రాత్రి ట్రాన్స్‌కో డీఈ ప్రభాకర్ ప్రారంభించారు. ఎన్నికల ముందు మంత్రి శ్రీధర్‌బాబు ఇచ్చిన హామీ మేరకు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. భక్తులు, స్థానికుల విన్నపం మేరకు మంత్రి మంజూరు చేసిన రూ.12లక్షలతో విద్యుత్ పనులు చేపట్టారు. ఈ మేరకు ట్రాన్స్‌కో మంథని డీఈ ప్రభాకర్ పనులు పర్యవేక్షించారు. అపరకాశిగా పేరున్న బహుగుళ్ల ఆలయానికి వెళ్లేందుకు భక్తుల సౌకర్యార్థం రోడ్డు, విద్యుత్ పనులు పూర్తి చేయించిన మంత్రికి స్థానికులు కృతజ్ఞతలు తెలి పా రు. మాజీ సర్పంచులు గోవిందుల పద్మ ఆనంద్, మేడగోని సతీశ్‌గౌడ్ పాల్గొన్నారు.
హైరిస్క్ గర్భిణులను గుర్తించాలి
హైరిస్క్ గర్భిణులను గుర్తించాలి
Comments
Please login to add a commentAdd a comment