ఆర్యవైశ్య నాయకులతో సమావేశం
సుల్తానాబాద్(పెద్దపల్లి): కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా ఆర్యవైశ్యులు, పట్టభద్రులు కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం నాయకులతో శుక్ర వారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టర్లు, నమూనా బ్యాలట్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి బరిలో నిలిచారని, ఆయ న గెలుపు కోసం మద్దతు ఇవ్వాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్న య్యగౌడ్, నాయకులు మినుపాల ప్రకాశ్‌రావు, శ్రీగిరి శ్రీనివాస్, దామోదర్‌రావు, ఊట్ల వరప్రసాద్, పల్లా మురళి, అల్లెంకి సత్యనారాయణ, కొమురవెల్లి భాస్కర్, సురేశ్ పాల్గొన్నారు.
ప్రతీ ఎకరాకు సాగునీరు
జూలపల్లి(పెద్దపల్లి): శ్రీరాంసాగర్ కాలువల కింద ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామని ఎమ్మె ల్యే విజయరమణారావు అన్నారు. ఎస్సారెస్సీ డీ– 86 మెయిన్ కెనాల్ నుంచి 10–ఎల్, 1– ఎల్ ఉప కాలువకు సాగునీరు రావడం లేదని పలువురు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో ఆయన కాలువలు పరిశీలించారు. చీమలపేట నుంచి ధూళికట్ట వరకు చివరి ఆయకట్టుకూ సాగునీరు అందించాలని సూచించారు. నాయకులు సామ రాజేశ్వర్‌రెడ్డి, పర్శరాములు, తోంటి మధుకర్, తోంటి బుచ్చయ్య, సమ్మయ్య, అశోక్ ఉన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యం
ఎమ్మెల్యే విజయరమణారావు
Comments
Please login to add a commentAdd a comment