ఇళ్ల నిర్మాణానికి అనుమతి తీసుకోవాలి
● డీఎల్‌పీవో సతీశ్‌కుమార్
మంథని: గ్రామాల్లో పంచాయతీ అనుమతి లేకుండా నిర్మాణాలు చేయరాదని డీఎల్‌పీవో సతీశ్‌కుమా ర్ సూచించారు. ఎక్లాస్‌పూర్ గ్రామ పంచాయతీ కా ర్యాలయాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. పంచాయతీ, రికార్డులను పరిశీలించారు. ఆ తర్వా త పారిశుధ్య నిర్వహణ తీరుపై ఆరా తీశారు. ఎస్‌డబ్ల్యూఎం షెడ్ నిర్వహణ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సెగ్రిగేషన్ షెడ్‌లో కంపోస్టు ఎరువు తయారు చేయాలని పంచాయతీ కార్యదర్శి, సిబ్బందికి సూచించారు. ఈనెల 25వ తేదీ వరకు వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో జరిగిన సమీక్ష సమావేశంలో జారీచేసిన ఆదేశాలను తప్పకుండా పాటించాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌లో నమోదు చేసుకున్న దరఖాస్తుదారులను ఫోన్ ద్వారా సంప్రదించి ఫీజు చెల్లించి తమ భూములు క్రమబద్ధీకరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన చేయించాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment