కలెక్టరేట్ ఎదుట ధర్నా
సుల్తానాబాద్(పెద్దపల్లి): వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ముస్లిం కోరారు. ఇదే డిమాండ్‌తో కలెక్టరేట్ ఎ దుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఏవో శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. యునైటెడ్ ఫోరం ముస్లిం ప్రతినిధులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై కక్ష సాధింస్తోందన్నారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
తెలుగు భాష గొప్పది
మంథని: తెలుగు భాష చాలా గొప్పదని విద్యార్థి యువత వ్యవస్థాపకుడు కొండేల మారుతి అన్నారు. సాహిత్య లోకంలో తెలుగు భాష అ మృతం గొప్పదన్నారు. అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప ట్టణంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి యువత కార్యాలయంలో పలు పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్త పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. అనంతరం తెలుగు మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ప్రతినిధులు లావణ్య, శైలజ, రజిత, శర ణ్య, మేడగోని రాజమౌళిగౌడ్, గట్టు నాగన్న, తాటి బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
‘లహరి’లో 10 శాతం రాయితీ
గోదావరిఖనిటౌన్: బెంగళూరు – గోదావరిఖ ని మధ్య నడిచే లహరి స్లీపర్ కమ్ సీటర్ స ర్వీసు రిజర్వేషన్‌లో 10 శాతం రాయితీ కల్పించనున్నట్లు గోదావరిఖని ఆర్టీసీ డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. గోదావరిఖని నుంచి పెద్దపల్లి, కరీంనగర్, హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు ప్రతీరోజు సర్వీసు నడుస్తుందన్నారు. గోదావరిఖనిలో సాయంత్రం 5.30 గంటలకు బస్సు ప్రారంభమవుతుందన్నారు. గోదావరిఖని బస్టాండ్‌లోని రిజర్వేషన్ కౌంటర్ లేదా www.tgsrtcbus.in వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసుకొని రాయితీ పొందాలన్నారు.
28 వరకు కుల గణన సర్వే
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో ఈనెల 28వ తేదీ వరకు కుల గణన సర్వే ని ర్వహించనున్నట్లు కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరు ణశ్రీ తెలిపారు. తాళం వేసిన ఇళ్లు, ఆసక్తి లేక పోవడం తదితర కారణాలతో సామాజిక, ఆర్థి క, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన సర్వే లో వివరాలు ఇవ్వలేని కుటుంబాలకు మరో సారి అవకాశం కల్పించిందన్నారు. రోజూ ఉద యం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నగరపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తు చేయాలని కమిషనర్ సూచించారు.
23న గురుకుల ప్రవేశ పరీక్ష
మంథని: గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈనెల 23 నిర్వహించనున్నట్లు స్థానిక గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ శ్రీనాథ్ శుక్రవా రం తెలిపారు. ఐదో తరగతిలో ప్రవేశాల కో సం, 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల కో సం పరీక్ష నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్, ఆధార్‌కార్డ్, బ్లూ, లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, ఉదయం 9.30 గంటల్లోగా ప రీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఆయన కోరారు.
నిలిచిన బల్దియా వాహనాలు
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలో శుక్రవారం ఉదయం పెట్రోల్ లేకపోవడంతో పారిశుధ్య విభాగానికి చెందిన చెత్త సేకరించే సుమారు 10 వాహనాలు నిలిచిపోయాయి. ప్రతీరోజు పారిశుధ్య వాహనాలకు ఇంధనం పోస్తున్న ఓ బంక్ నిర్వాహకులు.. గు రువారం బల్దియా వాహనాలకు ఇంధనం పో యడానికి నిరాకరించడంతో వాహనాలు నిలిచిపోయాయని తెలిసింది. బకాయిలు అధికం కావడంతోనే ఇంధనం పోయడానికి నిరాకరించారని ప్రచారం జరుగుతోంది. కాగా, శానిటేషన్ విభాగంలో కొందరు అధికారుల మధ్య కొంతకాలంగా కోల్డ్‌వార్ నడుస్తోందని తెలు స్తోంది. వాహనాలు నిలిచిపోవడానికి అధికారుల మధ్య అంతర్గత విభేదాలే కారణమని ప్రచారం కావడం చర్చనీయాంశమైంది.
గైనకాలజిస్ట్ పోస్టుల భర్తీకి
25న ఇంటర్వ్యూలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని తెలంగాణ వైద్య, విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉ న్న 2 గైనకాలజిస్టు ఫోస్టుల భర్తీకి ఈనెల 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని డీఎంహెచ్‌వో అన్న ప్రసన్న కుమారి శుక్రవారం తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిన పోస్టులు భర్తీ చేస్తామ న్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.00 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హతగల వైద్యులు బయోడెటాతో పా టు ఒరిజనల్, జిరాక్స్‌లతో జిల్లా ఆస్పత్రి సూ పరింటెండెంట్ కార్యాలయంలో హాజరు కావా లని కోరారు. వివరాలకు 84990 61999 నంబర్‌లో సంప్రదించాలని ఆమె సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment