గైర్హాజర్‌పై నజర్
గోదావరిఖని: సింగరేణి కార్మికులు పనివిధానం మార్చుకోవాలని, 8 గంటల పాటు కచ్చితంగా పనిచేయాల్సిందేనని యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. సంస్థలో సుమారు 42వేల మంది కార్మికులు పనిచేస్తుండగా, ఇటీవల 17వేల మందికిపైగా యువ కార్మికులు కారుణ్య నియామకా ల ద్వారా విధుల్లో చేరారు. యువ కార్మికుల్లో ఎక్కువమంది గైర్హాజర్ అవుతున్నట్లు యాజమా న్యం గుర్తించింది. సంస్థ భారీ ఉత్పత్తి లక్ష్య సాధనలో ముందుకు సాగుతున్న తరుణంలో 2024– 25 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించింది. ఇప్పటివరకు 92 శాతం మాత్రమే లక్ష్యం సాధించింది. మరికొద్దిరోజులే వార్షిక లక్ష్యానికి గడువు ఉంది.
యువ కార్మికులే అధికం..
అయితే యువ కార్మికులు చాలామంది విధులకు గైర్హాజరవుతుండడంతో ఈ ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై పడుతోంది. దీంతో రెండురోజుల క్రితం అన్ని ఏరియాల జీఎంలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సంస్థ సీఎండీ బలరాం ఉద్యోగుల గైర్హాజర్‌ౖను సీరియస్‌గా తీసుకున్నారు. ఈవిషయంలో ఏరియా వారీగా కౌన్సెలింగ్ నిర్వహించి గైర్హాజర్ తగ్గించాలన్నారు. పనివిధానాన్ని కచ్చితంగా పెంపొందించుకోవాలని సూచించారు. డ్యూటీలో నిర్ణీత 8గంటలు పనిచేయాల్సిందేనని, దీనిలో ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేశారు. మరో వందేళ్లకు సరిపడా సంస్థ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. సంస్థ భవిష్యత్‌కు ఢోకా లేదనే విధంగా ముందుకు సాగాలన్నారు. నూతన డైరెక్టర్ల సమక్షంలో సోమవారం నిర్వహించిన అన్ని ఏరియాల సమీక్ష సమావేశం వాడీవేడిగా సాగింది. ప్రధానంగా సంస్థ భవిష్యత్‌పై సుధీర్ఘంగా చర్చించారు. మస్టర్‌పడి బయటకు వెళ్లేవారిని ఉపేక్షించవద్దని సూచించారు. దీనికోసం పటిష్టమైన విధానాన్ని రూపొందించుకోవాలని సింగరేణి సీఎండీ సూచించారు.
గైర్హాజర్ కార్మికులను గుర్తించాలి
సంస్థ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో విధులకు హాజరుకాని వారిని గుర్తించి జాబితా తయారు చేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. అవసరమైతే వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించి విధులకు హాజరైయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే గైర్హాజరు కార్మిక కుటుంబ సభ్యులతో మాట్లాడి విధులకు తప్పనిసరిగా హాజరైయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని, ఈ క్రమంలో సంస్థ కోసం పనిచేయని వారు అసవరం లేదని సంస్థ స్ఫష్టం చేసింది. అధికారులైనా, ఉద్యోగులైనా ఇదే నిబంధన వర్తిస్తుందని ఆదేశించింది.
మస్టర్ పడి బయటకు వెళ్లే కార్మికులపై కఠిన చర్యలు
ఎనిమిది గంటల పాటు విధి నిర్వహణలో ఉండాల్సిందే
ఉద్యోగుల పనితీరు పెంపుపై సింగరేణి యాజమాన్యం దృష్టి
మరో వందేళ్ల భవిష్యత్
మరో వందేళ్ల భవిష్యత్ లక్ష్యంగా ముందుకు సాగాలి. సంస్థలో పనిచేసే వారికి తగిన గుర్తింపు, పనిచేయని, పనితీరు మెరుగుపర్చుకోని వారిపై చర్యలు తీసుకుంటాయి. పనిసంస్కృతి మెరుగు పర్చుకుని సంస్థను అభివృద్ధి పథంలో పయనించేలా సమష్టిగా ముందుకు సాగాలి.
– బలరాం, సీఎండీ, సింగరేణి
గైర్హాజర్‌పై నజర్
Comments
Please login to add a commentAdd a comment