పారిశుధ్యంపై దృష్టిపెట్టండి
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలో పారిశుధ్యం మెరుగుపర్చడంపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి కోయ శ్రీహర్ష ఆదేశించారు. నగరపాలక పనితీరుపై గురువారం అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీ,తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్‌ఐడీసీ) నిధుల ద్వారా చేపట్టిన నగరాభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణ, ఆస్తి పన్ను వసూలు, టౌన్ ప్లానింగ్ తదితర అంశాలపై కలెక్టర్ తెలుసుకున్నారు. వరద నియంత్రణ పనులకు ప్రాధాన్యత కల్పిస్తూనే పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని, పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించాలని సూచించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు గడువులోగా ఆస్తి పన్ను వసూలు చేయాలని, నగరంలో రోడ్లపై చెత్త లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్‌ఈ శివానంద్, ఈఈ రామణ్, అధికారులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై సమీక్ష
కోల్‌సిటీ(రామగుండం): ప్రీ స్కూల్‌లో పిల్లలకు బోధన పకడ్బందీగా జరగాలని అధికారులను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై, గురువారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతీ సూపర్‌వైజర్ తన పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలను రెగ్యులర్‌గా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతినెలా పిల్లల బరువు చెక్ చేయాలని, తక్కువ బరువు ఉన్న పిల్లలకు అవసరమైన పోషకాలు అందించాలని సూచించారు.గ్రామాల్లో క్రోనిక్ వ్యాధులు గుర్తించిన 14 మందికి జిల్లా వైద్యా శాఖ ద్వారా అవసరమైన పరీక్షలు నిర్వహించి చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, సీడీపీవో అలేఖ్య, అధికారులు పాల్గొన్నారు.
ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలి
పెద్దపల్లిరూరల్: ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డ్‌లో వివరాలు, బయోమెట్రిక్ అప్ డేట్ చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా స్థాయి ఆధార్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. 5 నుంచి 15 సంవత్సరాల లోపు గల ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలని సూచించారు.
వేగవంతంగా పూర్తి చేయాలి
ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఇందిరమ్మ ఇండ్లను గ్రౌండ్ చేసేందుకు అధికారులు సన్నద్ధం కా వాలని, మోడల్ ఇందిరమ్మ ఇళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గు రువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ కోయ శ్రీహర్ష
ఒత్తిడి జయిస్తే.. విజయమే
కలెక్టర్ కోయ శ్రీహర్ష
పారిశుధ్యంపై దృష్టిపెట్టండి
Comments
Please login to add a commentAdd a comment