ఇసుక రవాణా వాహనాలపై ప్రత్యేక నిఘా
ఇసుక రీచ్‌ను పరిశీలిస్తున్న సీపీ శ్రీనివాస్
ముత్తారం(మంథని): ఇసుక రవాణా వాహనాలపై ప్రత్యేక నిఘా పెడుతామని రామగుండం పోలీస్ క మిషనర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. ముత్తారం మండలం ఖమ్మంపల్లి, జిల్లాలపల్లి మానేరులో ని ర్వహిస్తున్న ఇసుక రీచ్‌లను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెద్దపల్లి జోన్‌లో మంథని, ము త్తారం పోలీస్‌స్టేషన్‌లోని ఇసుక రీచ్‌ల నిర్వహణపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాహనాల వే బిల్స్, లోడ్ పరిమితిని పరిశీలించారు. ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న ర్యాంపుల నుంచి ఇసుక తరలించే విధానాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ఇసుక వాహనాల తనిఖీ వివరాలు తప్పకుండా నమోదు చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ ఆదాయనికి గండికొట్టేలా ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేసే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పోలీసు శాఖ చర్యలు చేపడుతుందనన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ డా.చేతన, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర, గోదావరిఖని ఏసీపీ రమేశ్, మంథని సీఐ రాజు, ఎస్సై నరేశ్ ఉన్నారు.
రామగుండం సీపీ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment