స్వచ్ఛ సర్వేక్షణ్ బరిలో రామగుండం
కోల్‌సిటీ(రామగుండం): దేశంలోని పట్టణాలు, నగరాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ఏటా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక క్యూసీఐ బృందం పోటీ చేస్తున్న పట్టణాలు, నగరాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఆన్‌లైన్‌లో మార్కులు వేస్తారు. ఈ మార్కుల ఆధారంగానే కేంద్రం స్వచ్ఛత ర్యాంకులు ప్రకటిస్తోంది. శ్రీస్వచ్ఛ సర్వేక్షణ్–2024శ్రీకు సంబంధించి మార్కుల జాబితాను ఈనెల 17న కేంద్రం ఆయా మున్సిపాలిటీలకు పంపించింది. ఈ పోటీలో ప్రజల అభిప్రాయాల(సిటిజన్ ఫీడ్‌బ్యాక్) సేకరణ కీలకం కాగా, రామగుండం నగరపాలక సంస్థ కూడా పాల్గొంటోంది.
మార్చి 5 వరకు గడువు
● స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌కు 5శాతం మార్కులు కేటాయించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు కేంద్రం క్యూఆర్ కోడ్ విడుదల చేసింది. అయితే సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌కు మార్చి 5వరకు మాత్రమే గడువు విధించింది. దీంతో అదనపు కలెక్టర్, నగరపాలక కమిషనర్(ఎఫ్‌ఏసీ) జే.అరుణశ్రీ ప్రత్యేక దృష్టిసారించారు. గురువారం మెప్మా సిబ్బందితో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో అభిప్రాయాలు సేకరించాలని ఆదేశించారు. ఈక్రమంలో మెప్మా సిబ్బంది నగర ప్రజలను కలుసుకొని అభిప్రాయం చేప్పిన వారితోనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
పూర్తయిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ
● కేంద్రం సూచన మేరకు స్వచ్ఛ సర్వేక్షణ్–2024 కోసం ఇప్పటికే రామగుండం బల్దియాకు చెందిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. సిటిజన్ ఫీడ్‌బ్యాక్ పూర్తి చేసిన తర్వాత ఢిల్లీ నుంచి ప్రత్యేక క్యూసీఐ బృందం నగరానికి రానుంది. ఈ బృందం నగరంలో క్షేత్రస్థాయిలో పారిశుధ్యం పనితీరుపై గోప్యంగా ఆన్‌లైన్‌లో మార్కులు వేయనుంది.
ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ కోసం ఆశలు
● రామగుండం బల్దియాకు ప్రస్తుతం ఓడీఎఫ్ ప్లస్ (బహిరంగ మలవిసర్జన రహితం) గుర్తింపు మాత్రమే ఉంది. ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ గుర్తింపు కోసం ఇటీవల కేంద్రానికి దరఖాస్తు చేశారు. అయితే రామగుండంలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్‌టీపీ) పూర్తయినా వినియోగంలోకి రాలేదు. మల్కాపూర్ శివారులో వినియోగంలో ఉన్న ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్‌ఎస్టీపీ) ద్వారా ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్ గుర్తింపు వస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.
ఫీడ్‌బ్యాక్‌లోని 10 ప్రశ్నలు
● చెత్త సేకరణకు రోజూ ఇంటికి, దుకాణానికి వస్తున్నారా?
● మీ నివాస ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఊడుస్తున్నారా?
● మీ ప్రాంతానికి సమీపంలో తరుచూ పేరుకుపోయిన చెత్త కుప్పలను....... చూస్తున్నారు?
● చెత్త పారేయడానికి ముందు ఇంటి వద్ద తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారా?
● చెత్తను వేరు చేసి వాహనానికి ఇస్తున్నారా, అన్నింటినీ కలిపి ఇస్తున్నారా?
● మార్కెట్లు, బజార్లు, పార్కులు, బహిరంగ ప్రదేశాల పరిశుభ్రత నిర్వహించడంలో స్థానిక అధికారులు ఎంతో ప్రభావవంతంగా ఉన్నారనుకుంటున్నారా?
● వ్యర్థ పదార్థాల నిర్వహణకు మీ నగరంలో ఉన్న తగ్గించు, పునర్వినియోగం, రీసైకిల్ (ఆర్‌ఆర్‌ఆర్) కేంద్రాల గురించి తెలుసా?
● మురుగుకాలువలు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడానికి, లైసెన్స్ పొందిన ఆపరేటర్లను మాత్రమే నియమించాలని మీకు తెలుసా?
● మీ ప్రాంతంలోని పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రత, నిర్వహణతో ఎంత మేర సంతృప్తి చెందారు?
● పారిశుధ్య సమస్యల పరిష్కారానికి ఎప్పుడైనా స్థానిక అధికారులకు నివేదించారా? దానిని ఎలా పరిష్కరించారు?
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వచ్చిన ర్యాంక్‌లు
2023
175
2022
136
2021
92
2020
211
2019
192
2018
194
2017
191
స్వచ్ఛ సర్వేక్షణ్– 2024కు కేటాయించిన మార్కులు
కేటాయించిన మార్కులు మొత్తం 12,500
గార్జెబ్ ఫ్రీ సిటీ విభాగానికి 1,300
ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్, వాటర్ ప్లస్ 1,200
ఇతర విభాగాల అంశాలకు 10,000
ఈనెల 17న కేంద్రం విడుదల చేసిన మార్కుల జాబితా
స్వచ్ఛత ర్యాంకులో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ ప్రాధాన్యం
నగర ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ
సంవత్సరం
ర్యాంకు
రామగుండం నగర పారిశుధ్య విభాగం ప్రొఫైల్
మొత్తం డివిజన్లు 50
విస్తీర్ణం 93.87 చదరపు కిలోమీటర్లు
జనాభా(2011 లెక్కల ప్రకారం) 2,29,644
మురికివాడలు 92
అసెస్‌మెంట్ల ప్రకారం గృహాలు 50,956
స్వచ్ఛ సర్వేక్షణ్ బరిలో రామగుండం
Comments
Please login to add a commentAdd a comment