కోల్‌సిటీ(రామగుండం): వ్యాపారులు సకాలంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించి నగరపాలక సంస్థకు సహకరించాలని అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్‌ఏసీ) జె.అరుణశ్రీ కోరారు. కొత్తగా ట్రేడ్ లైసెన్స్ పొందాలనుకునే వారు, రెన్యువల్ చేసుకునేవారు https:emunicipal.telangana. gov.in వెబ్‌సైట్ లేదా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గది కొలతలు నమోదు చేసేటప్పుడు కచ్చితమైన వివరాలు ఇవ్వాలన్నారు. తప్పుడు కొలతలు నమోదు చేసినట్లు తనిఖీలో గుర్తిస్తే 25 రెట్ల పెనాల్టీ విధించడం జరుగుతుందని పేర్కొన్నారు. కొలతల్లో మార్పు అవసరమైతే నగరపాలక సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవా లని సూచించారు. నగదు చెల్లింపులు లేకుండా ఆన్‌లైన్ విధానంలోనే ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలన్నారు. ట్రేడ్ లైసెన్స్‌కు సంబందించి వచ్చే ఫేక్ కాల్స్‌కు స్పందించి మోసపోవద్దని పేర్కొన్నారు. ట్రేడ్ లైసెన్స్‌కు సంబందించి పూర్తి వివరాలు కావలసిన వారు నగరపాలక సంస్థ కార్యాలయంలోని పారిశుధ్య విభాగంలో సంబంధిత అధికారిని స్వయంగా లేదా 99666 26680 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.
‘ప్రజలకు ఏం చేశారో చెప్పాలె’
మంథని: మంథని నియోజకవర్గ ప్రజలు అధికారం కట్టబెడితే మీ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు డిమాండ్ చేశారు. గురువారం నియోజకవర్గ ప్రజల తరఫున బాధ్యతలను గుర్తు చేస్తూ స్థానిక ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ పంపిస్తున్నట్లు తెలిపారు. ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపిస్తే మంత్రిగా అధికారం పొంది ఈ ప్రాంతానికి మంచి చేయాలనే ఆలోచన కూడా చేయడం లేదన్నారు. నియోజకవర్గంలోని మంథని, కాటారంలో ఒకటి చొప్పున ఐటీ కంపెనీ, రెండు పరిశ్రమలు ఏర్పాటు చేయించాలన్నా రు. నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, ఆరెపల్లి కుమార్, మాచిడి రాజూ గౌడ్, కిషన్‌రెడ్డి, పుప్పాల తిరుపతి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment