యూరియాను అందుబాటులో ఉంచాలి
ఓదెల: సొసైటీ గోదాముల్లో రైతులకు యూరి యాను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం ఓదెల మండలం కొలనూర్, పొల్కపల్లి, నాంసానిపల్లె గ్రామాల్లో ని పాఠశాల, అంగన్‌వాడీ సెంటర్, ఓదెలలోని కస్తూరిబా బాలికల విద్యాలయం, ప్రాథమిక ఆ రోగ్య కేంద్రం, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించారు. రైతులకు ప్రస్తుత సీజన్‌లో యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. సహకార సంఘాల్లో యూరియా నిల్వల ను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని తెలిపా రు. కొలనూర్ జెడ్పీ పాఠశాలలో మంజూరైన నిధులతో పనులు ప్రారంభించాలన్నారు. పొత్కపల్లి పాఠశాలలో డయాస్ నిర్మాణం చేపట్టాలని, కస్తూర్బా పాఠశాలలో రెండు అదనపు గదులతో పాటు అవసరమైన టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలని తెలిపారు. టీబీ లక్షణాలున్న ప్రతిఒక్కరి కీ ఎక్స్‌రే తీయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకలోపంతో ఉన్న విద్యార్థులను మానిటర్ చే స్తూ వారి ఎదుగుదలకు కృషిచేయాలన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసి న సమావేశంలో పలు సమస్యలపై అధికా రులతో సమీక్షించారు. రాబోయే వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఓదెల తహసీల్దార్ సునీత, ఎంపీడీవో తిరుపతి, ఎంఈవో ఎర్ర రమేశ్, వ్యవసాయాధికారి భాస్కర్, పీఆర్ ఏఈఈ జగదీ్‌శ్, సీఈవో గొలి అంజిరెడ్డి, డాక్టర్లు శంజనేష్, షాబొద్దీన్, ప్రధానోపాధ్యాయుడు పాల్గొన్నారు.
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
Comments
Please login to add a commentAdd a comment