
రీచ్‌ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు
ముత్తారం(మంథని): ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు రీచ్‌ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్. శ్రీధర్ వెల్లడించారు. టీజీఎండీసీ వైస్ చైర్మన్ బీఆర్‌వీ సుశీల్ కుమార్, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం ఆయన మా నేరు తీరంలోని ఖమ్మంపల్లి, జిల్లాలపల్లి ఇసుక రీచ్‌లను పరిశీలించారు. శ్రీధర్ మాట్లాడుతూ, రీచ్‌ల వద్ద 400 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మించాలని, స్టాక్ యార్డు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఒకేదారి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులను నియమించా లని ఆదేశించారు. పేదలకు ఇసుక అందుబాటు లో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇసు క వాహనాలకు ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలని సూచించా రు. అంతకుముందు కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లాలపల్లి ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠాలు చెబుతూ కాసేపు ముచ్చటించారు. మంథని ఆర్డీ వో సురేశ్, మైనింగ్ అస్టిటెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు
రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్.శ్రీధర్ వెల్లడి

రీచ్‌ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు
Comments
Please login to add a commentAdd a comment