
బాల్యం.. బానిసెల్!
● అన్నం తినాలన్నా, హోంవర్క్ చేయాలన్నా స్మార్ట్‌ఫోన్ ఇవ్వాల్సిందే ● వీడియోలు, రీల్స్ చూడకపోతే ముద్ద దిగదు ● తల పట్టుకుంటున్న తల్లిదండ్రులు ● అలవాటు మానకపోతే ఆరోగ్యానికి హానికరం ● హెచ్చరిస్తున్న నిపుణులు
కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బాలుడు నాలుగో తరగతి చదువుతున్నాడు. కరోనాకు ముందు వరకు చదువులో చురుగ్గా ఉండేవాడు. వైరస్ విజృంభిస్తున్న సమయంలో అందరూ ఇంటికే పరిమితమవడంతో ఆ చిన్నారి స్మార్ట్‌ఫోన్
చూడటం మొదలు పెట్టాడు. గంటల తరబడి చూశాడు. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చాక
ఫోన్‌లోనే లీనమవుతుండటంతో చదువుపై
ధ్యాస లేక పూర్తిగా వెనకబడి పోయాడు.
జగిత్యాల జిల్లాకు చెందిన ఓ బాలికదీ ఇదే పరిస్థితి. స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి, ఇవ్వకపోతే ఏడవడం, చెప్పినట్లు వినకపోవడం వంటివి చేస్తోంది. ఫోన్ ఇస్తేనే అన్నం తింటానంటూ భీష్మించుకు కూర్చుంటోంది. తల్లిదండ్రులు
ఏమీ చేయలేక ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పాప ఆరోగ్యం, భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
సిరిసిల్ల జిల్లాకు చెందిన బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో తల్లిఫోన్ చూడడం మొదలు పెట్టాడు. యూట్యూబ్‌లో చానెల్ క్రియేట్ చేశాడు. సొంతంగా రీల్స్ చేస్తూ సెల్‌కు బానిసయ్యాడు. ఇంటివద్దే కాదు.. స్కూల్‌లోనూ ఫోన్‌పైనే దృష్టిపెడుతూ.. చదువు పక్కన పెట్టాడు. గమనించిన క్లాస్ టీచర్ విద్యార్థితో పాటు తల్లిదండ్రులను మందలించింది. ఫోన్ ఇస్తే స్కూల్‌కు పంపొద్దని గట్టిగా హెచ్చరించింది.

బాల్యం.. బానిసెల్!
Comments
Please login to add a commentAdd a comment