![ఆశలు ఆవిరి](/styles/webp/s3/article_images/2025/02/16/33333_mr-1739644154-0.jpg.webp?itok=buCbMGGG)
ఆశలు ఆవిరి
సాక్షి, పెద్దపల్లి: స్థానిక ఎన్నికల నిర్వహణకు అధి కార యంత్రాంగం అన్నిఏర్పాట్లు చేసింది. మరోవారం రోజుల్లో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని భావించిన ఆశావహులు.. అప్పుడే ప్రచారం, విందులతో ఎన్నికల సందడి షురూ చేశారు. మరోసారి కులగణన చేపట్టడంతోపాటు, బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఇక ఇప్పట్లోఎన్నికలు జరగవని తేలిపోయింది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు సుమారు మూ డు నెలలకుపైగా సమయం తీసుకునే అవకాశం ఉండడంతోఎన్నికల వేడి తగ్గిపోయింది. ఆశావాహుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది.
140 ఎంపీటీసీ స్థానాలు.. 755 పోలింగ్ కేంద్రాలు
పరిషత్ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఓటరు జాబితా, పోలింగ్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సిబ్బందికి శిక్షణ తదితర వాటిని పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాల జాబితా కూడా ప్రదర్శించింది. గత ఎన్నికల్లో 138 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఈసారి మూడు స్థానాలు పెరిగాయి. రామగుండం కార్పొరేషన్‌లో వీలినమైన కుందనపల్లి, లింగాపూర్, వెంకట్రావుపల్లి గ్రామాల ను ఎంపీటీసీ స్థానాలుగా గుర్తించగా, అదే సమయంలో జగిత్యాల జిల్లాలో కలిసిన పాలకుర్తి మండలంలోని గ్రామాలతో ఒక ఎంపీటీసీ స్థానం తగ్గింది. దీంతో మొత్తంగా జిల్లాలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 140కి చేరుకోగా, వీటి పరిధిలో 755 పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు.
మహిళా ఓటర్లే అధికం
జిల్లాలో 266 గ్రామపంచాయతీలు, 2,462 వార్డు లు ఉన్నాయి. 140 ఎంపీటీసీ, 13 జెడ్పీటీసీ స్థానా లు ఉన్నాయి. వీటి పరిధిలో 4,13,306 మంది ఓట ర్లు ఉన్నారు. వీరిలో 2,03,336 మంది పురుషులు, 2,09,927 మంది మహిళలు, 13 మంది ఇతర ఓట ర్లు ఉన్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అత్యధికంగా ధర్మారం మండలంలో 43,606మంది ఓటర్లు ఉండగా, అత్యల్ఫంగా ఎలిగేడులో 18,537 మంది ఓటర్లు ఉన్నారు.
రిజర్వేషన్ల కోసం ఎదురుచూపులు
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు క ల్పించేందుకు ప్రభుత్వం కులగణన చేపట్టింది. స ర్వేలో పాల్గొనని వారికోసం మరో అవకాశం కల్పి స్తూ ఈనెల 16 నుంచి 28 వరకు సర్వే చేపడుతోంది. ఆన్‌లైన్ సర్వేతోపాటు టోల్‌ఫ్రీ నంబరు ద్వారా ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన అధికారుల వద్ద కూడా నమోదు చేసుకునేలా అవకాశం కల్పించారు. దీంతో ఎన్నికల ప్రక్రియకు మరోమూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. కులగణన సర్వే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనుండడంతో ఆశావహుల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో తాము బరిలో ఉంటామని చెబుతూ ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల కోసం జోరుగా ఖర్చు పెడుతూ, రాజకీయాలు వేడేక్కించిన ఆశావాహులు.. ప్రభుత్వ నిర్ణయంతో కొంతవెనక్కి తగ్గారు.
ఇప్పట్లో ‘స్థానికం’ లేనట్లే..!
కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం స్థానిక పోరు వాయిదా
Comments
Please login to add a commentAdd a comment