సాక్షి, గుంటూరు: తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తుంగభద్ర మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్. రాష్ట్రంలో ఏది జరిగినా వైఎస్ జగన్‌పై నెట్టే ప్రయత్నం చేసి చంద్రబాబు తప్పుకోవాలని చూస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు.
కాగా, అంబటి రాంబాబు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యామ్ గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. తుంగభద్ర మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వల్లే ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయిందని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో ఏది జరిగినా వైఎస్ జగన్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు తప్పుకోవాలని చూస్తున్నారు. గేటు కొట్టుకుపోవడం వల్ల అనంతపురం జిల్లాకు వరద ముంపు ఉంది.
ఇక, ప్రాజెక్ట్‌లపై చంద్రబాబు అమాయకంగా మాట్లాడుతున్నారు. కాపర్ డ్యాం లేకుండానే చంద్రబాబు పోలవరం నిర్మిస్తానని అన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. నాడు సూపర్ సిక్స్ అన్నారు.. ఇప్పుడేమో భయం వేస్తోందంటున్నారు. రెండున్నర నెలలకే కూటమి సర్కార్ ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఇప్పటికైనా చెప్పిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment