తెలంగాణ ఎన్నికలు: బీజేపీ మేనిఫెస్టో విడుదల | Amit Shah Released BJP Manifesto Of Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎన్నికలు: బీజేపీ మేనిఫెస్టో విడుదల

Published Sat, Nov 18 2023 7:18 PM | Last Updated on Sat, Nov 18 2023 7:37 PM

Amit Shah Released BJP Manifesto Of Telangana - Sakshi

హైదరాబాద్‌:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తన మేనిషెస్టోను విడుదల చేసింది. శనివారం సాయంత్రం బీజేపీ పలు అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది.  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో మేనిఫెస్టోను విడుదల చేశారు. సకల జనుల సౌభాగ్య పేరుతో  మేనిఫెస్టోను అమిత్‌ షా ప్రకటించారు.

  • బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ 
  • ధరణికి బదులుగా మీ భూమి యాప్‌
  • ప్రజలందరికీ సుపరిపాలన, సమర్థవంతమైన పాలన
  • వెనుకబడిన వర్గాల సాధికారత, అందరికీ సమానమైన చట్టం వర్తింపు
  • కూడు -గూడు, అందరికీ  ఆహార, నివాస భద్రత 
  • రైతే రాజు అన్నదాతలకు అందలం
  • విత్తనాల కొనుగోలుకు రూ.2500 ఇన్‌పుట్‌ అసిస్టెన్స్‌
  • మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం 
  • మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పొరేషన్‌
  • యువశక్తి-ఉపాధి.. యూపీఎస్సీ తరహాలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణ
  • ఈడబ్ల్యూఎస్‌ కోటాతో సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను 6 నెలల్లో భర్తీ చేస్తాం 
  • వైద్య శ్రీలో భాగంగా అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా 
  • గల్ఫ్‌ బాధితుల కోసం నోడల్‌ ఏజెన్సీ 
  • కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ
  • మండల కేంద్రాల్లో నోడల్‌ స్కూళ్ల ఏర్పాటు
  • వరికి రూ.3100 మద్దతు ధర
  • నిజామాబాద్‌లో టర్మరిక్‌ సిటీ
  • ఆడబిడ్డ భరోసా కింద 21 ఏళ్లు వచ్చేనాటికి రూ.2 లక్షలు అందజేత 
  • ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి 4 గ్యాస్‌ సిలిండర్లు ఫ్రీ
  • సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను రీయింబర్స్‌మెంట్‌ 
  • అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు 
  • స్వయం సహాయక బృందాలకు 1 శాతం వడ్డీతోనే రుణాలు 
  • రైతులకు ఉచితంగా దేశీ ఆవులు 
  • రైతులకు ఉచితంగా పీఎం పంటల బీమా 
  • వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ టూర్లు 
  • ఉమ్మడి పౌరస్మృతి కోసం కమిటీ ఏర్పాటు 
  • మేడారం జాతరకు జాతీయ స్థాయిలో గుర్తింపు 
  • నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు
  • బీఆర్‌ఎస్‌ అవినీతిపై విచారణకు కమిటీ 
  • ఎస్సీ వర్గీకరణకు సహకారం 
  • బడ్జెట్‌ స్కూళ్లకు పన్ను మినహాయింపు 
  • నిజాం ఘుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ 
  • పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు
  • మేడారం జాతర జాతీయ స్థాయిలో నిర్వహణ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement