సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ రిట్ పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారించింది. వైఎస్సార్‌సీపీ కార్యాలయాల కూల్చివేతకు నోటీసులపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో విధించింది. రేపటి వరకు స్టేటస్‌కో విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుచేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రేపు(గురువారం) మరోసారి కోర్టు విచారణ జరపనుంది. మొత్తం 10 జిల్లా కార్యాలయాలపై లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై టీడీపీ సర్కారు కక్షగట్టింది. గతం మరచిపోయి కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇటీవల చీకటిలో కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయాలను కూల్చేయడానికి పావులు కదుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment