
సాక్షి, చిత్తూరు: కుప్పం మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 25 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం ఆరు వార్డులను మాత్రమే గెలుచుకుంది. 19 స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ కుప్పం మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కూమారుడు లోకేష్ ఎన్ని విధాలుగా కుప్పం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు మాత్రం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమ పాలనకు పట్టం కట్టారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు కుప్పంలో ఘోర పరాభవం ఎదురైంది.
చదవండి: (కుప్పంలో కుప్పకూలిన టీడీపీ)
Time: 3. 10 PM
► కుప్పం మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం
►మొత్తం 25 స్థానాల్లో 19 వైఎస్సార్‌సీపీ గెలుపు, 6 టీడీపీ గెలుపు
► 1,2,3, 4, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15,16,17, 21, 23, 25 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు
►5, 11, 18, 19, 20, 22, వార్డుల్లో టీడీపీ విజయం
వార్డుల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లు వివరాలు
► 1వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జగదీష్ 654 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 2వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మునిరాజు 352 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 3వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అరవింద్ 98 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 4వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జయమ్మ 215 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 5వ వార్డులో టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్ 156 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 6వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జయంతి 12 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 7వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నాగరాజు 300 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 8వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రమ్మ 314 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 9వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హఫీజ్ 77 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 10వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మమత 276 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 11వ వార్డులో టీడీపీ అభ్యర్థి కస్తూరి 6 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 12వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మాధవి 188 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హంస 115 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 14వ వార్డు వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవం
► 15వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తిలకావతి 465 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 16వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సుధీర్ 234 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 17వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దేవకి 87 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 18వ వార్డులో టీడీపీ అభ్యర్థి షబానా తాజ్ 104 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 19 వ వార్డులో టీడీపీ అభ్యర్థి దామోదరం 95 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 20వ వార్డులో టీడీపీ అభ్యర్థి సోమశేఖర్ 151 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 21వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లావణ్య 7 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 22వ వార్డులో టీడీపీ అభ్యర్థి సురేష్ 232 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 23వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాజ్ కుమార్ 69 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► 24వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సయ్యద్ అలీ 50 ఓట్ల ఆధిక్యతతో గెలుపు.
► 25వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మంజుల 525 ఓట్ల ఆధిక్యతతో గెలుపు.