ఆరు గ్యారంటీలు.. రేవంత్‌కు బండి సంజయ్‌ సవాల్‌ | Bandi Sanjay Hot Comments On Cm Revanth Reddy | Sakshi
Sakshi News home page

ఆరు గ్యారంటీలు.. రేవంత్‌కు బండి సంజయ్‌ సవాల్‌

Nov 9 2024 8:57 PM | Updated on Nov 9 2024 9:03 PM

Bandi Sanjay Hot Comments On Cm Revanth Reddy

మహారాష్ట్రలో రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలేనంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

సాక్షి, కరీంనగర్‌: మహారాష్ట్రలో రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలేనంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీల అమలుపై తెలంగాణలో పాదయాత్ర చేసే దమ్ముందా?. నక్సలైట్ల భావజాలమున్న వాళ్లకు విద్యా కమిషన్ లో చోటు కల్పిస్తారా?’’ అంటూ విమర్శలు గుప్పించారు.

కరీంనగర్‌లో కార్యకర్తలతో కలిసి ‘జితేందర్ రెడ్డి’ సినిమాను వీక్షించిన కేంద్ర మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసోళ్లను కూడా నక్సలైట్లు దారుణంగా చంపిన విషయం మర్చిపోయారా?. సభ్య సమాజానికి ఏం సంకేతాలు పంపుతున్నట్లు?. తక్షణమే విద్యా కమిషన్‌ను రద్దు చేయాలి. ప్రజాస్వామ్యవాదులారా.. కమిషన్ రద్దు కోసం రోడ్డెక్కండి. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఎఫ్పుడో మర్చిపోయారు?. జనం కష్టాల్లో ఉన్నా ఫాంహౌజ్‌కే పరిమితమైనోడిని లీడర్‌గా గుర్తిస్తారా?’’ అంటూ బండి సంజయ్‌ ప్రశ్నించారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి.. కేటీఆర్‌ రియాక్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement