సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయంలో వేడెక్కింది. ఇటీవల చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది నేతలపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బండి సంజయ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైంది. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌కు పొత్తు ఉందని వాళ్ల నేతలే చెబుతున్నారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు ఉంది. ఎమ్మెల్యేలు ఎటుపోయారో ఇన్ని రోజులు అధ్యక్షుడికి తెలియదా?. బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment