
సాక్షి, కామారెడ్డి: ప్రజల పక్షాన మాట్లాడేవారి గొంతు నొక్కేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కుట్రల్లో భాగమే తీన్మార్ మల్లన్న అరెస్టు అని, మల్లన్నను జైల్లోనే చంపేసేందుకు కుట్ర జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్ర కామారెడ్డి జిల్లాలో ప్రవేశిం చిన సందర్భంగా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామం వద్ద సంజయ్ విలేకరులతో మాట్లాడారు. తీన్మార్ మల్లన్న ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు.
మల్లన్నకు ఏం జరిగినా సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని హెచ్చరించారు. రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజ కొంటామని గప్పాలు కొట్టిన సీఎం కేసీఆర్, ఇప్పుడు వరి వేస్తే ఉరి అంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం ప్రకటనతో రాష్ట్రంలో నలుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. హైదరాబాద్‌లో బాలిక హత్యాచార ఘటనపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సిగ్గు చేటన్నారు.
ఖాళీ పోస్టులపై శ్వేత పత్రం ప్రకటించాలి
హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేత పత్రం ప్రకటించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.
ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా కామారెడ్డిలో ప్రజలకు అభివాదం చేస్తున్న సంజయ్
Comments
Please login to add a commentAdd a comment